
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించి దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం పోస్ట్ చేసింది. బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా బలమైన స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పేలుడు సంభవించిన తరుణంలో భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. లెబనాన్ అధికారిక నేషనల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. హెజ్బొల్లాకు బలమైన కేంద్రంగా ఉన్న దక్షిణ బీరూట్ శివార్లలోని దాహియేలోని ఘోబెయరీ పరిసరాల్లోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో అపార్ట్మెంట్ పక్కన ఉన్న రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ దాడిలో ఏవైనా వాహనాలు దెబ్బతిన్నాయా అనేదానిపై స్పష్టత లేదు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే.. తాము దక్షిణ బీరూట్‌పై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా పలువురు అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయానికి వాషింగ్టన్ మద్దతు కూడా ఉందని వారు పేర్కొన్నారు. హెజ్బొల్లా ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్న మూడు డ్రోన్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై వేర్వేరు ఘటనల్లో దాడి చేశాయని.. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం ఇవాళ తెల్లవారుజామున తెలిపింది ఇజ్రాయెల్ భద్రతకు, ఐడీఎఫ్ దళాలకు ముప్పుగా ఉన్న ఏ లక్ష్యాన్నైనా నిర్వీర్యం చేసేందుకు మేము చర్యలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ వైమానిక దళం స్పష్టం చేసింది. హిజ్బుల్లా మాత్రం దక్షిణ లెబనాన్‌లోకి చొరబడ్డ ఇజ్రాయెల్ దళాలపై పలు దాడులు జరిపినట్లు ప్రకటించినప్పటికీ.. ఉత్తర ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదు. యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos
Jun 14 2026 7:11 PM | Updated on Jun 14 2026 7:17 PM
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించి దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం పోస్ట్ చేసింది. బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా బలమైన స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పేలుడు సంభవించిన తరుణంలో భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
లెబనాన్ అధికారిక నేషనల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. హెజ్బొల్లాకు బలమైన కేంద్రంగా ఉన్న దక్షిణ బీరూట్ శివార్లలోని దాహియేలోని ఘోబెయరీ పరిసరాల్లోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో అపార్ట్మెంట్ పక్కన ఉన్న రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ దాడిలో ఏవైనా వాహనాలు దెబ్బతిన్నాయా అనేదానిపై స్పష్టత లేదు.
ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే.. తాము దక్షిణ బీరూట్‌పై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా పలువురు అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయానికి వాషింగ్టన్ మద్దతు కూడా ఉందని వారు పేర్కొన్నారు. హెజ్బొల్లా ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్న మూడు డ్రోన్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై వేర్వేరు ఘటనల్లో దాడి చేశాయని.. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం ఇవాళ తెల్లవారుజామున తెలిపింది
ఇజ్రాయెల్ భద్రతకు, ఐడీఎఫ్ దళాలకు ముప్పుగా ఉన్న ఏ లక్ష్యాన్నైనా నిర్వీర్యం చేసేందుకు మేము చర్యలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ వైమానిక దళం స్పష్టం చేసింది. హిజ్బుల్లా మాత్రం దక్షిణ లెబనాన్‌లోకి చొరబడ్డ ఇజ్రాయెల్ దళాలపై పలు దాడులు జరిపినట్లు ప్రకటించినప్పటికీ.. ఉత్తర ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదు.
యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)
కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21)
మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు)
నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..?
కడప కార్పొరేషన్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన
బ్యాగ్ తో టిప్ టాప్ గా ఫ్లైట్ దిగింది.. అడ్డంగా బుక్కైంది..
జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు... కుక్క చావులో అనుమానం