
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు
సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Vijay Antony:విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘వంద దేవుళ్లు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
ట్రైలర్ ప్రారంభం నుంచే భావోద్వేగాలతో పాటు కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. జీవితంలో ప్రతి మనిషికి అవసరమైన ప్రేమ, బంధాలు, అనుబంధాల చుట్టూ కథ తిరుగుతున్నట్టు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ చిత్రంలో భార్యాభర్తల బంధం, తల్లీకొడుకుల మధ్య ఉన్న అనుబంధం వంటి అంశాలను హృద్యంగా చూపించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో యాక్షన్, ఎమోషన్, డ్రామా వంటి అంశాలను కూడా దర్శకుడు సమతుల్యంగా మేళవించినట్లు ట్రైలర్ సూచిస్తోంది.
ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. స్వాసిక తన పాత్రలో చాలా బాగా కనిపిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే దర్శకుడు శశి మంచి కథను ప్రేక్షకులకు అందించబోతున్నారని పేర్కొన్నారు. విజయ్ ఆంటోని ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకుంటారనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు.
ట్రైలర్లో కనిపించిన విజువల్స్, నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలకు సంగీతం మరింత బలం చేకూర్చినట్లు అనిపిస్తోంది. కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసికతో పాటు అజయ్, కావ్య, శక్తి, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, వినోదిని, మునిష్ కాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాలాజీ శ్రీరామ్ సంగీతం అందించగా, ఎస్.బి. దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.
జూన్ 19న విడుదల కానున్న ‘వంద దేవుళ్లు’ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.