
చండీగఢ్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ విజయం సాధించింది. భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. టెస్టుల్లో టీమ్ఇండియాకు ఇది అతిపెద్ద విజయం కావడం
విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ 152 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో 412 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. అఫ్గాన్‌ను ఫాలో ఆన్ ఆడించింది. ఆ జట్టు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత ఘోరంగా ఆడి 112 పరుగులకే ఆలౌటైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.