
చండీగఢ్: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్‌ను భారత్ ఫాలో ఆన్ ఆడిస్తోంది. మూడో రోజు ఆట టీ
విరామ సమయానికి అఫ్గాన్ 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అప్సర్ (4) క్రీజులో ఉన్నారు. అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాంటే ఇంకా 314 పరుగులు చేయాలి. సెథిఖుల్లా అటల్ (42), రహ్మనుల్లా గుర్బాజ్ (24), రహ్మత్ షా (13), అబ్దుల్ మాలిక్ (8) వరుసగా ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అప్సర్ జాజాయ్ (4*) ఉన్నాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, కుల్దీప్ యాదవ్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.