
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. కొంతకాలంగా పేలవఫామ్‌తో సతమతమవుతున్న అతడిని భారత టీ20 కెప్టెన్‌గా తొలగించడమే కాకుండా జట్టులోకి కూడా తీసుకోలేదు
. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువకావడంతో అతను తిరిగి జట్టులో చోటు దక్కించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఈ క్రమంలో అతని గురించి మరో వార్త బయటికొచ్చింది. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ఆ జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్న సూర్య.. గత సీజన్లో తీవ్రంగా నిరాశపర్చాడు. అతను 270 పరుగులు మాత్రమే చేశాడు. పైగా ముంబయి ఇండియన్స్ కూడా కొన్నాళ్లుగా తమస్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. దీంతో వచ్చే ఏడాది ఆ ఫ్రాంఛైజీ జట్టులో భారీ మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సూర్యకుమార్ (Suryakumar Yadav) ముంబయి ఇండియన్స్‌కు గుడ్ బై చెబుతాడనే ప్రచారం మొదలైంది. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబయిని ఫాలో కాకపోవడం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది. సూర్య తన ఇన్‌స్టా ఖాతాలో ఆ ఫ్రాంఛైజీకి సంబంధించిన 100కి పైగా పోస్టులను డిలీట్ చేశాడు. అతని ప్రొఫైల్‌లో ఇటీవల ముంబయి ఇండియన్స్‌కు సంబంధించిన ఒక్క ఫొటో మాత్రమే ఉంది. రోహిత్ శర్మ, ధోనీతో కలిసి దిగిన చిత్రమది. దీంతో సూర్య ముంబయికి గుడ్ బై చెబుతాడన్న ప్రచారం ఊపందుకుంది. హార్దిక్ పాండ్యను కూడా సూర్య ఫాలో కాకపోవడం గమనార్హం. మరోవైపు, హార్దిక్‌ను ముంబయి వదులుకుంటుందనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.