
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Dead Person Phone Unlock: మనలో చాలా మంది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. అందులో అడ్వాన్స్ టెక్నాలజీతో ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు పాస్‌వర్డ్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేసే విధానం నుంచి ఇప్పుడు ఫింగర్ ప్రింట్‌తో అన్‌లాక్ చేసేంతగా టెక్నాలజీ మారిపోయింది. అయితే మనలో చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. మనిషి చనిపోయాక అతని ఫోన్ అన్‌లాక్ చేసి ఎవరైనా చెక్ చేస్తారా? అని.. అయితే దాని వెనుకున్న అసలు రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్ ద్వారా అతని మొబైల్ అన్‌లాక్ చేసి డేటా దొంగలిస్తారా? అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. మొబైల్ ఫోన్లలో ప్రధానంగా మూడు రకాల వేలిముద్ర సెన్సార్లు ఉపయోగిస్తున్నారు. అవి ఆప్టికల్, కెపాసిటివ్, అల్ట్రాసోనిక్ వంటి టెక్నాలజీ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ప్రతి సెన్సార్‌కు వాటి ప్రత్యేకమైన సాంకేతికత, ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంది. మొబైల్లో సమాచారం సెక్యూర్ చేసుకునేందుకు.. ప్రతి ఒక్కరూ సులభమైన వేలిముద్రలను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకవేళ ఎవరైనా చనిపోతే, వారి వేలిముద్రలతో వారి ఫోన్ అన్‌లాక్ అవుతుందా? లేదా..? దీనిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి.
ప్రతి వ్యక్తి బొటనవేలోని వేలిముద్రలు భిన్నంగా ఉంటాయి. అయితే వ్యక్తి మరణించిన తర్వాత అతని ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయోచ్చా? మరణం సంభవించినప్పటి నుండి గడిచిన సమయాన్ని బట్టి ఫోన్లలో ఉపయోగించే సెన్సార్ రకం ఆధారపడి ఉంటుంది.
మరణం సంభవించిన మొదటి కొన్ని గంటలలో, చర్మం ఇంకా మృదువుగా ఉన్నప్పుడు, ఆప్టికల్ లేదా కెపాసిటివ్ సెన్సార్లు తాత్కాలికంగా పనిచేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, 12 నుండి 24 గంటల తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది. చర్మం కుంచించుకుపోవడం, తేమను కోల్పోవడం, వాహకత్వం తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల కెపాసిటివ్ సెన్సార్ పూర్తిగా విఫలమవుతుంది.
దీని అర్థం ఏమిటంటే, చనిపోయిన వ్యక్తి వేలిముద్ర పనిచేయదు. అదేవిధంగా.. ఆప్టికల్, అల్ట్రాసోనిక్ సెన్సార్లు రక్త ప్రసరణ లేకపోవడాన్ని గుర్తించి, ఫోన్‌ను అన్‌లాక్ చేయడాన్ని వెంటనే తిరస్కరిస్తాయి.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.