
TVS Maxi scooter | ఇంటర్నెట్ డెస్క్: స్కూటర్.. అంటే ఒకప్పుడు ఫ్యామిలీ టూవీలర్ మాత్రమే. ఇటీవల కాలంలో వీటి రూపు మారుతోంది. సామర్థ్యమూ పెరుగుతోంది. కుర్రకారును ఆకట్టుకోవడానికి కంపెనీలు స్టైలిష్
లుక్‌లో పవర్ఫుల్ ఇంజిన్‌తో మ్యాక్సీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో హోండా కూడా ADV160 పేరిట కొత్త స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
ప్రస్తుతం టీవీఎస్ కంపెనీ జూపిటర్, ఎన్‌టార్క్ పేరిట స్కూటర్లను విక్రయిస్తోంది. ఇందులో స్పోర్టీ లుక్‌లో ఉండే ఎన్‌టార్క్ కుర్రకారును ఆకట్టుకుంటోంది. దీంతో ఎన్‌టార్క్ 150 సీసీని సైతం కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు మరింత పవర్ఫుల్ ఇంజిన్‌తో 160 సీసీ మ్యాక్సీ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌ను పూర్తి కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్నట్లు సమాచారం. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో టీవీఎస్ పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత అధునాతన స్కూటర్‌గా కాబోతోందని తెలుస్తోంది. యమహా ఎరోక్స్ 155, హీరో జూమ్‌కు పోటీగా ఇదే సామర్థ్యంలో టీవీఎస్ మ్యాక్సీ స్కూటర్ రాబోతోందని తెలుస్తోంది. అధిక వీల్ బేస్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిస్క్ బ్రేక్స్‌తో వచ్చే ఏడాది లాంచ్ కాబోతోందని సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.