
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
AP CM Chandrababu naidu reacts on elderly man Satyanarayana from Siddantham video: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తనశైలీలో ఏపీలో పాలన అందిస్తుంది. ఒకవైపు ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తునే అపోసిషన్ పార్టీలపై విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో ఏపీ చంద్రబాబునాయుడు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలు వినేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అందుకే ప్రజలకు పథకాలు కానీ ఇతర ఎలాంటి కార్యక్రమాల్లో అయిన ప్రజలతో మమేకం అయ్యేందుకు చూస్తుంటారు. ఈ క్రమంలో జూన్ 9న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెస్ట్ గోదావరిలోని పెనుగొండ మండలంలోని సిద్దాంతం గ్రామంలో పర్యటించనున్నారు.
ఈ క్రమంలో కామధేను లంక సిద్దాంతం గ్రామానికి చెందిన సత్యనారాయణ రాజు అనే పెద్దాయనను ఒక యువకుడు సీఎం చంద్రబాబును చూశావా..?..అని అడిగాడు . నేనైతే ఆయననుచూడలేదని ఆయన హైదరాబాద్ లో ఉంటారని పెద్దాయన బదులిచ్చాడు. ఆ తర్వాత మరల మన సిద్దంతంకు ఆయన పట్టాపుస్తకాలు ఇచ్చేందుకు వస్తున్నారని చెప్పడంతో అక్కడకు వెళ్లి సీఎం చంద్రబాబు గారిని చూద్దామని అంటాడు. ఆయన గొప్ప నేత అని.. మన దగ్గరికేవస్తున్నప్పుడు మనం వెళ్లిచూడాలని అంటాడు.
ఆయనను చూసి ఒక నమస్కారం పెడదామని చంద్రబాబు పై తనకున్న అభిమానంను చెప్పాడు. దీన్ని సదరు యువకుడు పెద్దయనకు తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు, మంత్రి నారాలోకేష్ కు ట్యాగ్ చేశాడు. ఏసీ సీఎంకు వీరాభిమాని అయిన ఈ పెద్దాయన కోరిక తీర్చాలని కోరాడు. అది కాస్త విపరీతంగా వైరల్‌గా కావడంతో దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రియాక్ట్ అయ్యారు.
Read more: AP CM Chandrababu naidu: విశాఖ సైకిల్ ర్యాలీలో అనుకొని ఘటన.. ఏపీ సీఎం చంద్రబాబుకు రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. వీడియో..
జూన్ 9న సిద్దాంతంలో తప్పకుండా కలుద్దాం.. మీటింగ్ లో మాట్లాడుకుందాం.. సత్యనారాయణ గారు అంటూ చంద్రబాబు ట్విట్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విషయంకు పెద్దాయనకు చెప్పడంతో అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తంగా పెద్దాయన మనసులో ఉన్న కోరికను నెరవేర్చడంతో టీడీపి అభిమానులు ఏపీ సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.