
హైదరాబాద్: గతంలో కృష్ణా, ఇప్పుడు గోదావరి నీటిని మళ్లించేందుకు తెలంగాణను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao) ధ్వజమెత్తారు. గోదావరి-కావేరి అనుసంధానం పేరుతో ఏపీ ప్రభుత్వం నదీ జలాల
తరలింపునకు మరోసారి ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘గోదావరిలో సర్ప్లస్ వాటర్ లేదు. సర్ప్లస్ వాటర్ లేదని కేంద్రం చెప్పిన మాటనే బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. సమ్మక్కసాగర్, నాగార్జునసాగర్.. సోమశిల నుంచి కావేరీ గత ప్రతిపాదన. తెలంగాణ భూభాగమే టచ్ చేయకుండా ఏపీ ప్రభుత్వం నదుల అనుసంధానం చేస్తోంది. పోలవరం నుంచి నల్లమల సాగర్.. అక్కడి నుంచి కావేరీ అనుంసధానం చేయాలని ఏపీ ప్రతిపాదన. కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే.. తెలంగాణకు ఒక్క చుక్క నీరు కూడా రాదు, జాతీయ ప్రాజెక్టు రాదు. గోదావరి-బనకచర్లను మొదట బయటపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. దీనిపై ప్రశ్నించింది కూడా మా పార్టీయే’’ అని హరీశ్‌రావు అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మార్పులు జరగనున్నాయా?