
చండీగఢ్: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 368/3తో రెండో రోజు ఆటను టీమ్ఇండియా ప్రారంభించింది. శనివారమే సెంచరీ బాదిన శుభమన్ గిల్ (126; 177 బంతుల్లో) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. సలీమ్ బౌలింగ్‌లో అప్సర్ జాజాయ్కి క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. క్రీజులో రిషభ్ పంత్ (70*), ధ్రువ్ జురెల్ (4*) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 421/4. ఓపెనర్ కేఎల్ రాహుల్ (100), సాయి సుదర్శన్ (81) రాణించిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.