సినీ ప్రపంచం అంటేనే ఒక రంగుల లోకం. ఇక్కడ గ్లామర్‌కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వెండితెరపై హీరోయిన్లు ఎంత గ్లామర్ ఒలకబోస్తే అన్ని ఎక్కవ అవకాశాలు వస్తాయన్న సూత్రం దశాబ్దాలుగా నడుస్తూ వస్తోంది
. అయితే మారుతున్న కాలంతో పాటు ట్రెండ్ కూడా మారింది. నేటి తరం హీరోయిన్లు కేవలం మూడు సీన్లు, ఆరు పాటలకే పరిమితం కాకుండా నటనకు స్కోప్ ఉన్న విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ దురదృష్టవశాత్తూ కొందరు దర్శకులు మాత్రం ఇప్పటికీ హీరోయిన్ల పాత్రలను కేవలం గ్లామర్ బొమ్మలుగానే డిజైన్ చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది 'పెద్ది' చిత్రం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర కేవలం గ్లామర్ ప్రదర్శనకే పరిమితమవ్వడంతో సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శల వర్షం కురుస్తోంది. కేవలం భారీ రెమ్యునరేషన్ కోసమే ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రలను ఒప్పుకుంటారా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఇప్పటివరకు ఆమె చేసినవి రెండే సినిమాలు అయినా, అందులో గ్లామర్‌కే ప్రాధాన్యత ఉండటం ఆమె స్వయంకృతాపరాధమేనంటూ కొందరు విమర్శిస్తున్నారు. ట్రోలింగ్‌తో ఉలిక్కిపడిన మేకర్స్ జాన్వీకి సంబంధించిన కొన్ని సీన్స్‌ని తొలగించడంతో పాటు మహిళల్ని కించపరిచడం తమ ఉద్దేశం కాదంటూ బహిరంగ క్షమాపణలు చెప్పారు.* వయసు పెరిగేది మాకేనా.. హీరోలకు పెరగదా.. అన్నిచోట్లా ఇదే వివక్ష: తాప్సీ షాకింగ్ కామెంట్స్ జాన్వీకి అండగా ఆషికా రంగనాథ్ ఈ వివాదం ముదురుతున్న తరుణంలో పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను వివరిస్తూ తోటి నటీమణులు జాన్వీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ ఈ విషయంలో తన శైలిలో స్పందించగా.. తాజాగా కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ సైతం ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు. జాన్వీ కపూర్‌ను తప్పుబడుతూ వచ్చిన ఒక కథనంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ స్క్రీన్ షాట్‌ను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ, విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రామ్ చరణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, కేవలం క్రేజ్ లేదా భారీ పారితోషికం కోసమే నటిస్తూ తమను తాము తగ్గించుకుంటున్నారనే వాదనను ఆషికా పూర్తిగా తప్పుబట్టారు. హీరోయిన్లను నిందించడం ఫ్యాషన్‌గా మారిందని, మొదట ఆ ధోరణిని మార్చుకోవాలని ఆమె హితవు పలికారు. థియేటర్లలో ఇప్పటికీ ఇలాంటి గ్లామర్ పాత్రలే అమ్ముడవుతాయని నమ్ముతున్న సినీ వ్యవస్థను, అలాగే కేవలం కమర్షియల్ హంగులకే ప్రాధాన్యత ఇచ్చే మేకర్స్‌ని నిందించాలని ఆమె డిమాండ్ చేశారు. దర్శకులదే బాధ్యతపరిశ్రమలో ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందులను ఆషికా చాలా స్పష్టంగా వివరించారు. నటీనటులు ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో తమకు అందుబాటులో ఉన్న అవకాశాల పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనప్పుడు సహజంగానే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం లభిస్తుందని, అలాంటప్పుడు ఆయా చిత్రాలను ఎంచుకోవడంలో తప్పులేదని ఆమె సమర్థించారు. వెండితెరపై ఒక మహిళా పాత్ర అసంపూర్ణంగా ఉందన్నా లేదా సరిగ్గా రాయబడలేదన్నా.. ఆ బాధ్యత పూర్తిగా కథ రాసే రచయితలది, సినిమా తీసే దర్శకులదే అవుతుంది తప్ప, కేవలం స్క్రిప్ట్‌ను అనుసరించి నటించే హీరోయిన్లది కాదని ఆషికా కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.* జేడీ చక్రవర్తి చేసిన పనికి కోపంతో ఊగిపోయా.. ఫోన్ చేసి నోటికొచ్చినట్లు తిట్టేశా – రంభ టాలీవుడ్ ప్రయాణంకన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్, అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'అమిగోస్' (2023) సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి చిత్రంలోనే తన చలాకీతనంతో, నటనతో టాలీవుడ్ వర్గాలను ఆకట్టుకున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సరసన సంక్రాంతి కానుకగా వచ్చిన 'నా సామి రంగ' (2024) చిత్రంలో 'వరాలు' అనే పల్లెటూరి యువతిగా కీలక పాత్ర పోషించారు. సంప్రదాయబద్ధమైన లుక్‌లో ఆమె చేసిన నటన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (2026) అనే చిత్రంలో పూర్తి స్థాయి ప్రధాన కథానాయికగా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా నటిస్తోన్న ‘విశ్వంభర’లో కీలక పాత్రలో నటిస్తోంది.