
భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్నవయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ (15 ఏళ్ల 71 రోజుల) రికార్డు సృష్టించాడు. సుదీర్ఘకాలంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ పేరిట ఉన్న రికార్డును ఈ బాలుడు బద్దలు
కొట్టాడు. సచిన్ 1989లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్థాన్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. నిరుడు ఐపీఎల్ అరంగేట్రంలోనే తన విధ్వంసంతో అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్.. ఈసారి కూడా సంచలన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించాడు. మేటి బౌలర్లను కూడా చితకబాదిన ఈ కుర్రాడు.. 776 పరుగులతో 2026 ఐపీఎల్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వైభవ్ అరెంజ్ క్యాప్ సహా అయిదు అవార్డులు అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా.. గేల్ రికార్డును అతడు తుడిచిపెట్టాడు. వైభవ్ ఈ ఏడాది వన్డే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. తాజా ఐపీఎల్ ప్రదర్శన తర్వాత అతణ్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరిగాయి. సెలక్షన్ కమిటీకి అతణ్ని ఎంపిక చేయక తప్పలేదు. స్వయంగా అగార్కరే ఈ విషయం అంగీకరించాడు. ‘‘వైభవ్ తనను తానే ఎంపిక చేసుకున్నాడు. తన ఆటతో మాకు అతణ్ని ఎంపిక చేయక తప్పని స్థితిని కల్పించాడు’’ అని అన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.