
తెలంగాణలో త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు CM రేవంత్ తెలంగాణలో 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ప్రకటించి నిరుద్యోగులకు తీపి కబురు అందించారు
త్వరలో 5 వేల పోలీస్ ఉద్యోగాలు 15 నెలల్లో రికార్డు స్థాయి నియామకాలు యూపీఎస్సీ విధానాలతో పారదర్శక ఉద్యోగాల భర్తీ TG Police Jobs: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగాల(TG Police Jobs) భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఆయన ఒక మీడియా సదస్సులో అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో యూనిఫామ్ పోస్టుల కోసం వేచి చూస్తున్న వేలాది మంది యువతలో కొత్త ఆశలు చిగురించాయి. Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఖరారు.. ప్రభుత్వం తరఫున విస్తృత ఏర్పాట్లు.. లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా! తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. గడిచిన 15 నెలల స్వల్ప కాలంలోనే రికార్డు స్థాయిలో 67,760 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. భారతదేశంలోనే ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో భారీగా ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని యూపీఎస్సీ (UPSC) అనుసరించే అత్యుత్తమ విధానాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లో విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి లోపాలు లేని పారదర్శక విధానాల ద్వారానే అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా నియామకాలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.