
‘మా ఇంటి బంగారం’లో సాయిపల్లవి నటించాల్సిందని డైరెక్టర్ నందిని రెడ్డి వెల్లడించారు. నటి సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19 విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటర్యూలో పాల్గొన్న
నందిని రెడ్డి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘నిజానికి ఈ చిత్రం ముందు సాయిపల్లవితో తీయాలనుకున్నాం. డేట్స్, ఇతర కారణాల వల్ల కుదర్లేదు. తర్వాత కథలో మార్పులు చేసి సమంతతో తీశాం. తనతో ఇది నాకు మూడో చిత్రం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా ఇందులో కారం ఎక్కువ’’ అని నందిని రెడ్డి తెలిపారు. పూర్తి ఇంటర్వ్యూ వీడియోలో చూడండి. ఈ వార్త చదివారా: డబ్బులు తీసుకొని ప్రచారం చేయట్లేదు.. ఆరోపణలపై నటి స్పందన