
ఇంటర్నెట్‌డెస్క్: ఈ నెలలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. హ్యుందాయ్ (Hyundai), మారుతి సుజుకీ, టాటా మోటార్స్ వంటి ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి
. మోడల్‌ను బట్టి రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ సపోర్ట్, లాయల్టీ రివార్డ్స్, కార్పొరేట్ బెనిఫిట్స్ రూపంలో ఈ ప్రయోజనాలు లభించనున్నాయి.
ఈ నెలలో మారుతి సుజుకీ (Maruti Suzuk) కూడా పెద్దఎత్తున డిస్కౌంట్లు అందిస్తోంది. ఎంపీవీ కేటగిరీకి చెందిన ఇన్విక్టో పైనే ఏకంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు పొందొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.