
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ.. ప్రస్తుతం తన మూడు దశాబ్దాల చరిత్రలోనే అత్యంత తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత్రి మమతా
బెనర్జీని కాదని, మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 58 మంది తిరుగుబాటు పక్షాన నిలిచారు. ఈ రెబెల్ వర్గం శాసనసభలో తామే అసలైన ప్రతిపక్షంగా గుర్తింపు పొందడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ తిరుగుబాటు గ్రూపులో కూడా అంతర్గత విభేదాలు పొడసూపడంతో, పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు మమతా బెనర్జీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ రాజకీయ హైడ్రామా పతాక స్థాయికి చేరింది. బహిష్కృత టీఎంసీ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉండటంతో, ఆయనను అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా (LoP) గుర్తిస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ రెబెల్స్ గ్రూపును అధికారికంగా గుర్తించడం మమత వర్గానికి గట్టి ఎదురుదెబ్బ. అయితే, ఈ తిరుగుబాటు నేతలు మమతా బెనర్జీపై తమకున్న గౌరవాన్ని ప్రదర్శిస్తూనే.. ఆమెను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని 'ప్రధాన సలహాదారు'గా ఉండాలని ప్రతిపాదించడం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది.అసమ్మతికి కారణం అదేనా?ఈ తిరుగుబాటు మమతా బెనర్జీపై కంటే, ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలపైనేనని స్పష్టమవుతోంది. చాలా కాలంగా పార్టీ సీనియర్ నేతలను పక్కనపెట్టి అభిషేక్ బెనర్జీ సర్వాధికారాలు చెలాయించడంపై క్షేత్రస్థాయి నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే, రెబెల్స్ క్యాంప్‌లో కూడా