దక్షిణాది చిత్రసీమలో కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు రాఘవ లారెన్స్ . వెండితెరపై ఆయన చేసే డ్యాన్సులు, హారర్ సినిమాలకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో.. అంతకంటే
ఎక్కువగా ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆపదలో ఉండి సాయం అని అర్థించిన వారికి అండగా నిలబడటంలో లారెన్స్ ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఆయన ' కాంచన 4 ', 'బెంజ్' వంటి భారీ చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రాఘవ లారెన్స్ పేరు విపరీతంగా మారుమోగిపోతోంది. దానికి కారణం ఆయన వృత్తిపరమైన విషయాలు కావు.. ఒకటి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అయితే, మరొకటి ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన సంచలన వార్త!* తమిళనాడు రాజకీయాల్లో సంచలనం... తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక బరిలో రాఘవ లారెన్స్? కుమార్తె రాఘవి సినీ ఎంట్రీ!రాఘవ లారెన్స్‌కు అంత పెద్ద కుమార్తె ఉందనే విషయమే సాధారణంగా చాలా మంది సినీ ప్రియులకు తెలియదు. అలాంటిది తాజాగా ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తండ్రి పోలికలతో ఎంతో కళగా ఉండే రాఘవి, హీరోయిన్గా కాకుండా సరికొత్త పంథాలో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టబోతోందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒక విలక్షణమైన కథతో ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం కానుందనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ వార్తలపై లారెన్స్ సన్నిహిత వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. రాఘవి సినీ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని వారు కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదని, ఆమె పూర్తిగా తన ఉన్నత చదువులపైనే దృష్టి కేంద్రీకరించిందని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, లారెన్స్ కుమార్తె గురించిన ఈ వార్త ప్రస్తుతం ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది.* తారక్ చేతి వంట... కుకీస్ అడిగిన అభిమానికి అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్! లారెన్స్ వైపు 'టివికె' చూపు?ఇదిలా ఉంటే, తమిళనాడు రాజకీయాల్లోనూ రాఘవ లారెన్స్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాలు నమోదు చేసి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ ఇప్పుడు సరికొత్త రాజకీయ వ్యూహాలకు తెరలేపింది. సీఎం విజయ్ తాను పోటీ చేసి గెలిచిన రెండు స్థానాలలో ఒకటైన 'తిరుచ్చి ఈస్ట్' నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ప్రతిష్టాత్మక స్థానాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని భావిస్తున్న టీవీకే అధిష్టానం.. అక్కడ ఊహించని విధంగా రాఘవ లారెన్స్‌ను బరిలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రజల్లో మంచి గుర్తింపు, సేవా దృక్పథం ఉన్న బలమైన నాయకుడిని నిలబెట్టాలనే ఆలోచనతో ఉన్న విజయ్, అందుకోసం లారెన్స్ అయితేనే సరైన ప్రత్యామ్నాయమని భావిస్తున్నారట. ఒకవైపు కూతురి గురించి వార్తలు, మరోవైపు విజయ్ పార్టీ పొలిటికల్ ఆఫర్.. ఈ రెండింటి నడుమ లారెన్స్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.