
ఇంటర్నెట్డెస్క్: రామ్చరణ్ లేకపోతే ‘పెద్ది’ లేదని దర్శకుడు బుచ్చిబాబు అన్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి రోజు రూ.135కోట్లు చేసినట్లు చిత్ర బృందం
ఇంటర్నెట్డెస్క్: రామ్చరణ్ లేకపోతే ‘పెద్ది’ లేదని దర్శకుడు బుచ్చిబాబు అన్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి రోజు రూ.135కోట్లు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘పెద్ది బాక్సాఫీస్ ఛాంపియన్’ పేరుతో విలేకరుల సమావేశం నిర్వహించగా, దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడారు. ‘‘ఉప్పెన’ కన్నా 10 రెట్లు విజయాన్ని అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ‘పెద్ది’ పాత్ర స్ఫూర్తిమంతమైంది. మీ పిల్లల్ని తీసుకుని థియేటర్ వెళ్లి మూవీ చూడండి. రామ్చరణ్గారు పడిన కష్టాన్ని అందరూ గుర్తించారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. రాబోయే రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డులు సాధిస్తుందని కోరుకుంటున్నా ’’అని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి చిత్ర బృందం సంబరాలు చేసుకుంది.