
కొన్నిసార్లు అనుకోని సంఘటనలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి సంఘటనే న్యూయార్క్‌లో చదువుకునే భవిత మండవ జీవిత గమ్యాన్ని మార్చేసింది. ఉన్నత చదువు కోసం వెళ్లి ఫ్యాషన్ ప్రపంచాన్నే తన వైపు
Jun 5 2026 8:40 PM | Updated on Jun 5 2026 8:41 PM
కొన్నిసార్లు అనుకోని సంఘటనలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి సంఘటనే న్యూయార్క్‌లో చదువుకునే భవిత మండవ జీవిత గమ్యాన్ని మార్చేసింది. ఉన్నత చదువు కోసం వెళ్లి ఫ్యాషన్ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకునేలా చేసింది. ఇదంతా రెండేళ్ల కిందట జరిగింది. ఓ రోజు న్యూయార్క్ లోని బ్రూక్లిన్ సబ్వే స్టేషన్లో నిలబడి ఉండగా ఓ మోడలింగ్ ఏజెంట్ ఆమెను సంప్రదించాడు. అంతే ఆశ్చర్యకరంగా రెండు వారాల్లో ఇటలీలోని మిలాన్‌కు వెళ్లి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘బోటెగా వెనెటా’ కోసం ర్యాంప్ వాక్ చేసింది.
భవిత హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అమ్మాయి. జేఎన్టీయూలో చదువుకుంది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లింది. మోడలింగ్ రంగంలో భవితకు డియోర్, కొరేజెస్ వంటి ప్రముఖ ఫ్యాషన్ హౌస్‌లలో పని చేసే అవకాశం వచ్చింది. అంతేకాదు 2025లో ప్రముఖ టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఒకటైన ‘చానెల్’ నిర్వహించిన ఆర్ట్ షోను ప్రారంభించిన తొలి భారతీయ మోడల్‌గా చరిత్ర సృష్టించింది. ఆ షో కూడా న్యూయర్క్ సబ్వే స్టేషన్లో జరగడం విశేషం.
2026 మార్చిలో చానెల్ ఆమెను భారతీయ అంబాసిడర్‌గా నియమించింది. ఫోర్బ్స్ ఏషియా 30 అండర్ 30 జాబితాలో ఆర్ట్స్ విభాగంలో ఆమెకు స్థానం లభించింది. అవకాశం రావడం కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి స్థాయికైనా ఎదుగుతారనడానికి భవిత నిదర్శనంగా నిలిచింది.
చదవండి: 60 ఏళ్లు.. లక్షన్నర కిలోమీటర్లు
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!
61 ఏళ్ల వయసులో.. లవర్ తో ముచ్చటగా మూడోసారి
సంచలన ప్రకటన! అడవుల్లో, సరస్సుల్లో ఏలియన్స్?
నా సిగ్నేచర్ సాంగ్, లేలేలే నా రాజా పాడేటప్పుడు ANR షాక్
చంద్రబాబు 20కోట్ల భారీ స్కాం, బయటపెట్టిన అంబేటి రాంబాబు