
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తనపై చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ విప్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తనపై చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన పేర్ని నానిపై నిప్పులు చెరిగారు. మచిలీపట్నంలో బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏ) శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించిన ఎస్‌ఐఆర్ సమావేశాలను ప్రజా సమస్యల చర్చకు కాకుండా, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి వాడుకోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వడం మానేసి, ఇలాంటి వేదికలపై తన గురించి అసత్య ప్రచారం చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.ఎనిమిదేళ్ల క్రితం నీకే అప్పు ఇచ్చా.. ప్రజల ముందే చెప్పు!తాను దివాళా తీశానంటూ పేర్ని నాని చేసిన ఆరోపణలపై యార్లగడ్డ వెంకట్రావు ఘాటుగా స్పందించారు. నేను దివాళా తీయడం కాదు.. ఎనిమిదేళ్ల క్రితం పేర్ని నానికే నేను అప్పు ఇచ్చాను. ఆ డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారో ప్రజల ముందే చెప్పాలి అని డిమాండ్ చేశారు. డబ్బుల పెట్టెల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తాను ఎవరి వద్ద నుంచీ చందాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిజాలు తెలుసుకోవాలంటే పేర్ని నాని తన సొంత పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డినే అడగాలని సూచించారు. తానేం దిగజారుడు రాజకీయం చేయలేదని, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఉన్నప్పుడు బ్యాంకును రూ.115 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చి, రైతు నేస్తం వంటి మంచి పథకాలను అమలు చేశానని గుర్తు చేశారు. గన్నవరంలో తాను ఎలాంటి మట్టి దందా చేయలేదని, రైతులు, పేదలకు ఉచితంగా మట్టి అందించానని స్పష్టం చేశారు.విజయసాయి రెడ్డి ఫోన్ కోసం నా ఇంట్లోనే..పేర్ని నాని రాజకీయ వైఖరిని ఎండగడుతూ యార్లగడ్డ వెంకట్రావు కొన్ని ఆసక్తికర పాత విషయాలను బయటపెట్టారు. గతంలో పేర్ని నానికి వైఎస్సార్సీపీలో మంత్రి పదవి వచ్చిన సమయంలో విజయసాయి రెడ్డి ఫోన్ కాల్ కోసం తన భవనంలోనే రాత్రి 11:30 గంటల వరకు నాని టెన్షన్‌తో వేచి చూసిన విషయాన్ని బయటపెట్టారు. మాజీ మంత్రి కొడాలి నాని ద్వారానే తమకు పరిచయం ఏర్పడిందని చెప్తూ.. గత అనుబంధాలను మరిచి ఇప్పుడు ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. పేర్ని నాని తన రాజకీయ అవసరాల కోసం తరచూ మాట మారుస్తుంటారని, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేసి, ఆ తర్వాత పొగిడిన సందర్భాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌పై కూడా అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.గుడివాడలో కొడాలి నాని వారసుడి ఎంట్రీ, పోటీ పై కీలక ప్రకటన...!!వంగవీటి రాధా అంశాన్ని కూడా యార్లగడ్డ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో వంగవీటి రాధాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వాలని వైఎస్ జగన్ సమక్షంలో తానే గట్టిగా వాదించానని, ఈ విషయాన్ని స్వయంగా రాధానే ధృవీకరించగలరని చెప్పారు. రాధాకు తానే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే పేర్ని నాని.. ఆ సమయంలో రాధాకు టికెట్ కోసం ఎందుకు మద్దతు ఇవ్వలేదని, ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.వచ్చాక తేల్చుకుందాం.. ఓపెన్ ఛాలెంజ్!గత వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుల కారణంగానే తాను గత 19 నెలలుగా అమెరికా వెళ్లలేకపోయానని యార్లగడ్డ వెల్లడించారు. ప్రస్తుతం కోర్టు అనుమతితో తన వ్యక్తిగత పనుల నిమిత్తం పది రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలిపారు. నేను లేని సమయంలో నా వెనుక అసత్య ప్రచారాలు చేయవద్దు. నేను తిరిగి వచ్చిన తర్వాత ఏ అంశంపైనైనా, ఏ వేదికలోనైనా బహిరంగ చర్చకు సిద్ధం అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పేర్ని నాని మంత్రిగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గానికి అదనంగా ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.SIR: మోడీ పెట్టిన తలనొప్పి..! ఎస్ఐఆర్ పై పేర్ని నాని ఫైర్..!రాజకీయాల్లో పరుష పదజాలానికి తావు ఉండకూడదని హితవు పలికిన యార్లగడ్డ.. లంబు, జంబు, చెంబు వంటి చౌకబారు పదజాలాన్ని ఉపయోగించడం మానుకుని, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై పార్లమెంటరీ భాషలో చర్చించాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గంలో తానే స్వయంగా 13 నెలల పాటు పాదయాత్ర చేసి ప్రతి గ్రామం, ప్రతి గడపకు వెళ్లానని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేయడంతో కృష్ణా జిల్లా పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి.