
ఇంటర్నెట్ డెస్క్: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సత్తా చాటిన విషయం తెలిసిందే. పదిహేనేళ్ల వయసుకే అతడు ఏకంగా 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచి చరిత్ర లిఖించాడు. ఈ
ఇంటర్నెట్ డెస్క్: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సత్తా చాటిన విషయం తెలిసిందే. పదిహేనేళ్ల వయసుకే అతడు ఏకంగా 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచి చరిత్ర లిఖించాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడాలని ఆకాంక్షించాడు.
‘వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆట గురించి విస్తృతంగా ఆలోచిస్తుంటే మాత్రం అతడు తప్పనిసరిగా సుదీర్ఘ ఫార్మాట్ ఆడాలి. అయితే, నేర్చుకోవడానికి ఇష్టపడని విషయాలను మీరు మీ పిల్లలకు నేర్పించగలరా? అస్సలు నేర్పించలేరు. ఈ విషయాలన్నింటినీ పరిస్థితులే నడిపిస్తాయని నేను భావిస్తున్నా. కొన్నిసార్లు ఏం చేయాలో ఆట మీకు చెప్పినప్పుడు, అది చెప్పినట్లు చేయడమే ఉత్తమం’ అని అశ్విన్ అన్నాడు.
అలాగే, ఇష్టం లేకుండా ఒకరిని ఒత్తిడి చేస్తే సానుకూల ఫలితాలు రావని అన్నాడు. ‘క్రికెట్లోని ఒక నిర్దిష్ట ఫార్మాట్‌ను మీరు బలవంతంగా రుద్దలేరు. యువ క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్ ఆడటానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. వారు ఒకటి రెండు బంతులను డిఫెండ్ చేసి, వెంటనే షాట్లను నేర్చుకోవాలనుకుంటున్నారు’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.