
భువనగిరి అర్బన్, జూన్ 05 : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం భువనగిరి పార్టీ
భువనగిరి అర్బన్, జూన్ 05 : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం భువనగిరి పార్టీ ఆఫీసులో ఎశాల అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి సామాన్య, మధ్య తరగతి పేదలపై భారం మోపిందన్నారు. వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను విడదీసి పాలన కొనసాగించే విధానాలు ప్రధాని మోదీ చేస్తున్నాడని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం ద్వారా యువతలో అసంతృప్తి విపరీతంగా పెరిగిపోయి యువత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తే కోట్లాది మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నెల 10న నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సహాయ కార్యదర్శి బొలగానీ సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోదా శ్రీరాములు, ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్ది శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బచ్చనగోని గాలయ్య, ఉప్పల ముత్యాలు, బండి జంగమ్మ, చెక్క వెంకటేష్, చిగుళ్ల లింగం, పేరబోయిన మహేందర్ పాల్గొన్నారు.