నారింజ, నిమ్మ, బత్తాయి, గ్రేప్‌ఫ్రూట్ వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది. తద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అందుకే తెల్ల రక్తకణాలకు పెరిగేందుకు
నారింజ, నిమ్మ, బత్తాయి, గ్రేప్‌ఫ్రూట్ వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది. తద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అందుకే తెల్ల రక్తకణాలకు పెరిగేందుకు సిట్రస్ పండ్లు తినడం చాలా మంచిదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిపోర్ట్ పేర్కొంది.
క్యాప్సికమ్‌లో విటమిన్ సి మెండుగా లభిస్తుంది. ఇది తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనం ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాలకు పోరాడే సామర్థ్యాన్ని అందిస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు నివారించవచ్చు.
పాలకూర, మునగాకు, మెంతికూర వంటి ఆకుకూరల్లో ఫోలేట్, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరిగేందుకు కీలకంగా పనిచేస్తాయి.
బాదం, పొద్దుతిరుగుడు, వాల్నట్స్, గుమ్మడి గింజల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తెల్ల రక్తకణాలను హెల్తీగా ఉంచేందుకు సహాయపడతాయి.
పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఇంఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుకోవచ్చు.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి తెల్ల రక్తకణాలను కాపాడుతాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తాయి.
చికెన్, చేపలు, కోడిగుడ్లు, పప్పుల్లో లీన్ ప్రోటీన్ ఉంటుంది. ఇవి కొత్త తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని కాపాడుతాయి.
పెరుగు. యోగర్ట్, కిమ్చి వంటి పులియబెట్టిన ఆహారాల్లో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి తెల్ల రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తి తగ్గకుండా కాపాడుతాయి.