ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసిన 48 గంటలైనా కాలేదు.. కర్ణాటక కాంగ్రెస్‌లో అప్పుడే అసమ్మతి రాజుకుంది. శాఖల కేటాయింపుతో సీనియర్ల అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తాను కోరుకున్న శాఖ
ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసిన 48 గంటలైనా కాలేదు.. కర్ణాటక కాంగ్రెస్‌లో అప్పుడే అసమ్మతి రాజుకుంది. శాఖల కేటాయింపుతో సీనియర్ల అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తాను కోరుకున్న శాఖ దక్కలేదనే మనస్తాపంతో సీనియర్ నేత రామలింగారెడ్డి ఏకంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరో నలుగురు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. తాము ఇంతకంటే మెరుగైన శాఖలకు అర్హులమని కొందరంటే.. తనను పట్టించుకోవడం లేదని ఒక సీనియర్ నాయకుడు అలకబూనారు. మంత్రివర్గంలో తమకు మెరుగైన ప్రాతినిధ్యం కావాలని ముస్లిం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నలుగురు మంత్రులు ఇప్పటికే ప్రస్తుత శాఖలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి రామలింగారెడ్డి శుక్రవారం ఉదయం రాజీనామా చేయడంతో డీకే శివకుమార్‌కు తొలి షాక్ తగిలింది. తర్వాత కె.హెచ్. మునియప్ప, కే.జె. జార్జ్, సతీష్ జార్కిహోళి కూడా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.తనకు ఆహార, పౌర సరఫరాల శాఖను కేటాయించారని, అత్యంత సీనియర అయిన తనకు మెరుగైన శాఖ దక్కాల్సిదని అన్నారు. ‘‘క్యాబినెట్లో అత్యంత సీనియర్ అయిన నాకు ముఖ్యమైన శాఖ ఇవ్వాలని హైకమాండ్‌తో చెప్పాను’’ అని మునియప్ప అన్నారు. తన డిమాండ్ గురించి రాహుల్ గాంధీతో సహా పార్టీ నాయకులకు తెలియజేశానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్లలో ఒకరైన యునియప్ప కోలార్ లోక్‌సభ స్థానం నుంచి ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దేవనహళ్లి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన సిద్దరామయ్య మంత్రివర్గంలో కూడా పనిచేశారు.ఇంధన శాఖను పొందిన మరో సీనియర్ కేజే జార్జ్.. తన అనుమతి లేకుండా తన శాఖలోకి అధికారులను బదిలీ చేయడం, విధుల నుంచి తొలగించడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని అన్నారు. డీకే క్యాబినెట్లోనూ ప్రజా పనుల శాఖను నిలుపుకున్న మంత్రి సతీష్ జార్కిహోళి.. తనకు కేపీసీసీ అధ్యక్ష పదవి కూడా కావాలని, ఈ విషయాన్ని హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశానని చెప్పారు. కానీ, తాను హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు.