
ఇంటర్నెట్ డెస్క్: ‘దూత’ వెబ్‌సిరీస్‌తో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు నటుడు నాగచైతన్య. ఇప్పుడు ఈ హిట్ సిరీస్‌కు (Dhootha) సీక్వెల్ సిద్ధమవుతోంది. నేడు పూజా కార్యక్రమాలు జరగ్గా
ఇంటర్నెట్ డెస్క్: ‘దూత’ వెబ్‌సిరీస్‌తో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు నటుడు నాగచైతన్య. ఇప్పుడు ఈ హిట్ సిరీస్‌కు (Dhootha) సీక్వెల్ సిద్ధమవుతోంది. నేడు పూజా కార్యక్రమాలు జరగ్గా.. నాగార్జున క్లాప్ కొట్టి దీన్ని ప్రారంభించారు. ఈ సీక్వెల్‌కు నాగచైతన్య (Naga Chaitanya) నిర్మాతగా వ్యవహరించనుండటం విశేషం. ‘దూత సెకండ్ (Dhootha 2) చాప్టర్లో నిర్మాతగా నా తొలి అడుగు’ అంటూ నాగచైతన్య ఫొటోలు పంచుకున్నారు. మరోసారి మ్యాజిక్ చూడడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘దూత’.. 2023 డిసెంబరు 1న ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలై పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్‌లో జర్నలిస్టు సాగర్ వర్మ అవధూరిగా నాగచైతన్య ఆకట్టుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.