
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో.. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ సాంగ్స్ లో " అయ్యో దేకు దేకు అన్న దోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో.. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ సాంగ్స్ లో " అయ్యో దేకు దేకు అన్న దోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ కొడుకు" పాట ఒకటి. తెలంగాణ యాస, ఊపిచ్చే మ్యూజిక్, కాళ్లు కదిలించే బీట్లు, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే పదాలతో ఈ పాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకసారి విన్నవారిని మరోసారి వినేలా చేసే మ్యాజిక్ ఈ పాటలో కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఈ పాటకు వచ్చిన ఆదరణ మామూలుగా లేదు.
ఈ పాటలో ఎక్కువగా వినిపించే పదాలు, భావాలు డబుల్ మీనింగ్ లో ఉన్నాయని చాలామంది అభిప్రాయపడ్డారు. పాటను మొదటిసారి విన్నప్పుడు అది సాధారణ జానపదంలా అనిపించినా, లిరిక్స్‌ను కాస్త శ్రద్ధగా గమనిస్తే అందులోని పద ప్రయోగాలు మరో అర్థాన్ని కూడా సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదే అంశం ఈ పాటను మరింత వైరల్ అయ్యేలా చేసింది.
మ్యూజిక్ పరంగా చూస్తే "దేకు దేకు" పాటలో బీట్లు చాలా బాగుంటాయి. మొదటి కొన్ని సెకన్లలోనే ప్రేక్షకుడిని పాటలోకి లాగేసే ఎనర్జీ ఇందులో కనిపిస్తుంది. డీజే మ్యూజిక్, ఫాస్ట్ రిథమ్ ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచాయి. అందుకే ఈ పాట ఎక్కడ వినిపించినా యువత స్టెప్పులు వేయకుండా ఉండరు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, కాలేజ్ ఈవెంట్లు, ఊరేగింపులు ఇతర సందర్భాల్లో ఈ పాట తరచూ వినిపించడం వెనుక కారణం కూడా అదే.
ఫోక్ పాటల అసలు బలం వాటి భాషలో ఉంటుంది. ప్రజల నోట వినిపించే మాటలనే పాటల రూపంలో అందించడం వల్ల అవి త్వరగా జనాల్లోకి వెళ్తాయి. "దేకు దేకు" పాటలో కూడా అదే ఫార్ములాను అనుసరించారు. గ్రామీణ యాస, స్థానిక పదాలు, సరదా సంభాషణలు ఈ పాటకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. అత్త కోడలు కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఫోక్ సాంగ్ కి రాజేందర్ కొండా లిరిక్స్ అందించగా, సింగర్స్ లావణ్య, ప్రభ పాడారు. మహేష్ చింతబరి మ్యూజిక్ కంపోజ్ చేశారు.