
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తాజాగా బాంబు పేల్చాయి.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తాజాగా బాంబు పేల్చాయి. దీంతో రాబోయే రోజుల్లా టీఎంసీ పార్లమెంటరీ విభాగం నిట్టనిలువుగా చీలిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు పట్టు సాధించారు. పార్టీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా 57 మంది టీఎంసీలు ఎమ్మెల్యేలు ఇటీవల ఎన్నుకున్నారు. ఆ ఎన్నికను స్పీకర్ రతీంద్ర బోస్ కూడా గుర్తించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని గౌరవిస్తున్నామని చెబుతూనే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ నాయకత్వాన్ని మాత్రం ఒప్పుకునేది లేదని కరాఖండిగా చెబుతున్నారు.
తాజాగా టీఎంసీ ఎంపీల్లోనూ అసంతృప్తి పెల్లుబుకుతోంది. అభిషేక్ బెనర్జీ పట్ల పలువురు అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పాటేందుకు వీరు చర్చలు జరుపుతున్నారని, 12 మందికి పైగా ఎంపీలు ఇందుకు సముఖంగా ఉన్నారని అంటున్నాయి.
టీఎంసీ పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పడేందుకు, చీలక తెచ్చేందుకు తగిన సంఖ్యాబలంపై కూడా చర్చ జరుగుతోందని చెబుతున్నారు. టీఎంసీకి లోక్‌సభలో ప్రస్తుతం 29 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఫిరాయింపుల చట్టం నుంచి వేటుపడకుండా ఉండాలంటే కనీసం 23 మంది మద్దతు ఇందుకు అవసరమవుతుంది. రాజ్యసభ పరంగా చూస్తే టీఎంసీకి 13 మంది ఎంపీలున్నారు. ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం 9 మంది ఎంపీలు కలిసిరావాలి. ఈ పరిణామాలపై రెబల్ నేత రీతాబత్ర బెనర్జీని ప్రశ్నించగా, గత వారం రోజుల్లో తాను ఏ ఎంపీతోనూ మాట్లాడలేదని, అందువల్ల వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారో తనకు తెలియదని చెప్పారు. అయితే రేపటిరోజు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరని అన్నారు. దీనిపై వెటరన్ రాజ్యసభ ఎంపీ సుఖేందర్ శేఖర్ రాయ్ మాట్లాడుతూ, ఇంత తక్కువ సమయంలో 60 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం ఎప్పుడూ చూడలేదని, అదే స్పందన లోక్‌సభలోనూ ఉండే అవకాశాలు లేకపోలేదని అన్నారు.
లోక్‌సభకు మమతా బెనర్జీ .. బహరాంపుర్ నుంచి పోటీకి యోచన
కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు