
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Palamuru Pending Projects: పాలమూరులోని ప్రతి ఇంచు సాగునీటితో తడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలతోపాటు మరికొన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి కావాలంటే.. రూ.55 వేల కోట్లు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. వాళ్లు (బీఆర్ఎస్ పార్టీ) 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా.. 90 శాతం పనులు పూర్తి చేయడం ఎలా సాధ్యం? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
'రూ.27 వేల కోట్లు పంపులు, లిఫ్ట్‌లకే ఎక్కువ ఖర్చు చేశారు. ప్రజలు అమాయకులు కాదు.. అన్నీ గమనిస్తున్నారు. భూసేకరణ పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ నీరు నిల్వ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కర్ణాటక తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీలపై దృష్టి పెట్టామని చెప్పారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. కేసీఆర్‌కు ఊడిగం చేయడం మాని జిల్లా అభివృద్ధికి అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. భూసేకరణను అడ్డుకునేలా వ్యవహరించొద్దని సూచించారు. భూసేకరణను అడ్డుకునేలా వ్యవహరించొద్దని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడకుండా ఉంటే అదే పెద్ద సాయం అని పేర్కొన్నారు. తనపై కోపంతో కొడంగల్ ఎత్తిపోతలను తొక్కిపెట్టారని రేవంత్‌రెడ్డి తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత కీలకమని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. 90 టీఎంసీల నీళ్లతో 26 లక్షల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని.. సాగునీటితో పాటు పరిశ్రమలకూ పెద్ద ప్రయోజనం చేకూరేది అని వివరించారు. 'బీఆర్ఎస్ పార్టీ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారు. కమీషన్లు దండుకుని ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు' అని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు 'బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కనీసం భూసేకరణ కూడా చేయలేదు' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పంపులు, లిఫ్టుల్లో జరిగిన అవినీతిపై నాగం జనార్ధన్ రెడ్డి పోరాటం చేశారని తెలిపారు. పాలమూరులో ఏ ఒక్క ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేయలేదని చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్న పాలమూరును తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీఆర్ఎస్ నాయకులకు నరనరాన అబద్దం జీర్ణించుకుపోయింది' అని మండిపడ్డారు.
మనకెందుకు శ్రమ ఇటీవల పవన్ కల్యాణ్ వ్యవహారంపై తీవ్ర దుమారం రేపగా.. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఇష్టపడలేదు. 'పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారు. ఇక మనకెందుకు శ్రమ' అని చెప్పి ముగించారు.