
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్ గీతం' చిత్రం జూన్ 11న విడుదల కాబోతోంది. నిర్మాత నాగ్ అశ్విన్ భిన్నమైన రీతిలో ఈ సినిమా ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రముఖ దర్శకులు
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్ గీతం' చిత్రం జూన్ 11న విడుదల కాబోతోంది. నిర్మాత నాగ్ అశ్విన్ భిన్నమైన రీతిలో ఈ సినిమా ప్రచారాన్ని చేస్తున్నారు.
ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు వయసు ప్రస్తుతం 94 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన తెరకెక్కించిన సినిమా 'సింగ్ గీతం'. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా జూన్ 11న జనం ముందుకు రాబోతోంది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఒక గ్రామంలోని వ్యక్తులంతా మాటలను కూడా పాటలు మాదిరి పాడతారు. ఆ గ్రామంలోని వారి ప్రవర్తనకు కారణం ఏమిటీ? ఎందుకలా వారు వింతగా ప్రవర్తిస్తున్నారు? అనేదే ఈ సినిమాలోని ప్రధానాంశం. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను అలానే రూపొందించారు. క్రియేటివ్ జీనియస్ సింగీతానికి నిర్మాత రూపంలో మరో క్రియేటివ్ పర్సన్ నాగ్ అశ్విన్ జత అయ్యారు. విశేషం ఏమంటే... ఆ మధ్య వచ్చిన వినోదాత్మక చిత్రం 'జాతిరత్నాలు'కు సైతం నాగ్ అశ్వినే నిర్మాత.
మరో ఆరు రోజుల్లో జనం ముందుకు రాబోతున్న 'సింగ్ గీతం' ప్రచారాన్ని వినూత్నంగా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఎంపిక చేసిన నగరాలలో వైవిధ్య భరితంగా ప్రచారం చేస్తున్నారు. వైజాగ్ ఆర్.కె. బీచ్ లో సింగీతం దర్శకత్వం వహించిన 'ఆదిత్య 369' టైమ్ మిషన్ ను ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ ప్రసాద్స్ ఆవరణలో సింగీతం సినిమాల ఆడియో జ్యూక్ బాక్స్ ను పెట్టారు. అలానే సోషల్ మీడియాలోనూ 'సినిమా ప్రమోషన్ ఎలా చేయకూడదు? అనే కాప్షన్ తో తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఫన్నీగా సాగిన ఈ ప్రచారం నెటిజన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకెన్ని వింత వింత రీతుల్లో ప్రచారం చేస్తారో చూడాలి.
పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!
మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!
‘డ్రాగన్’లోని ఆ సంచనాల కోసం వెయిటింగ్ -ఎన్టీఆర్
త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్ప్రైజ్