
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఎదురైంది. ఈ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరించిన ఆయన, అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఎదురైంది. ఈ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరించిన ఆయన, అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం చాలా భయంకరంగా జరిగిందని, కేవలం కొద్దిపాటి గాయాలతో తాను సురక్షితంగా బయటపడ్డానని క్లార్క్ స్వయంగా వెల్లడించారు.
ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. తాను కారులో ప్రయాణిస్తూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అకస్మాత్తుగా ఒక పెద్ద లారీ కిందకు తమ కారు దూసుకుపోవడంతో ఒక్కసారిగా మేల్కొన్నానని, ఆ దృశ్యం చూసి షాక్‌కు గురయ్యానని తెలిపారు. ముందు వెళ్తున్న లారీ బ్రేక్ లైట్లు పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కారు డ్రైవర్ తనకు చెప్పాడని క్లార్క్ వివరించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా లారీ కిందకు దూసుకుపోవడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదం నుంచి తాను కొన్ని చిన్న చిన్న గాయాలతోనే క్షేమంగా బయటపడినప్పటికీ, కారు నడుపుతున్న డ్రైవర్ కాలు విరిగిందని క్లార్క్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ డ్రైవర్ చాలా భయపడ్డాడని, అది అతని సొంత కారు కాకపోవడమే అందుకు కారణమని చెప్పారు.
కష్టసమయంలో తనకు సహాయం చేసిన భారతీయ ప్రజల మంచి మనసును క్లార్క్ ఎంతో కొనియాడారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయం చేశారని, దేవుడి దయ వల్ల, ఇక్కడి మంచి ప్రజల వల్లనే తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రమాదం జరిగినప్పటి నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారులు నిరంతరం తనతో పాటు గాయపడిన డ్రైవర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారని, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మైఖేల్ క్లార్క్ పేర్కొన్నారు.