
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో అసమ్మతి ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఎంపీలు టచ్లో
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో అసమ్మతి ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఎంపీలు టచ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని రెబల్ నేత రితబ్రత బెనర్జీ తోసిపుచ్చారు. గత ఏడు రోజులుగా తానతో ఏ ఎంపీలూ టచ్లోలేరని.. అసలు వారేం చేస్తున్నారు? ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయంపైనా తనకు స్పష్టత లేదన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఓపికతో చూడడం తప్ప ఏమీ చేయలేమని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం మాత్రం ఉందన్నారు.
కాగా, దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు భాజపాతో టచ్లో ఉన్నారని, వారు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఎంసీకి చెందిన 15 మంది ఎంపీలు తనను సంప్రదించారని బెంగాల్ భాజపా నేత దిబ్యేందు అధికారి ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే వారు భాజపాతో చేరుతారా లేది రెబల్ ఎమ్మెల్యేలతో కలుస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో టీఎంసీకి మొత్తం 41 మంది (లోక్సభ - 28, రాజ్యసభ- 13) ఎంపీలు ఉన్నారు. బెంగాల్ శాసనసభలో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని 58 మందికి పైగా తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం తామే నిజమైన తృణమూల్ వర్గం అని ప్రకటించుకుంది. రాబోయే రోజుల్లో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు కూడా విడిపోతే తిరుగుబాటు వర్గం మరింత బలంగా మారే అవకాశం ఉంది.
టీఎంసీ సీనియర్ నేత, మమతా బెనర్జీకి నమ్మిన బంటుగా ఉన్న ఫిర్హాద్ హకీం కోల్కతా మేయర్ పదవి నుంచి వైదొలిగారు. ఈ పదవి నుంచి వైదొలగాలన్న తన అభ్యర్థనను పార్టీ అధినేత్రి మమత అంగీకరించడంతో శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఉత్తర్ప్రదేశ్ నోయిడాలోని 28 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది.