
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Husband beats and brutally killed wife with knife in attapur: సమాజంలో ఇటీవల కాలంలో మరీ దారుణ ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పవిత్రమైన వివాహ బంధం పూర్తిగా గాల్లో దీపంలా మారిపోయిందని చెప్పుకొవచ్చు. ప్రేమ పెళ్లిళ్లు, పెద్దల కుదిర్చిన పెళ్లిళ్లు అని తేడా లేకుండా కొన్ని రోజులు బానే ఉండి ఆ తర్వాత కట్టుకున్న గొడవలతో కట్టుకున్న వాళ్లను కాటికి పంపుతున్నారు. కొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు.
మరికొంత మంది ఆర్థిక సమస్యలతో పక్క చూపులు చూపుస్తున్నారు. సుపారీలు ఇచ్చి మరీ కట్టుకున్న వాళ్లను హత్యలు చేస్తున్నారు. దీంతో వివాహ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకొవచ్చు.అందుకు నేటి యువత పెళ్లిళ్లు అంటే అంతగా ఆసక్తి చూపించడంలేదు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని అత్తాపూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లోని అత్తాపూర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా తేజస్వీ నగర్ లో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఇద్దరు కొడుకులున్న భార్యపై భర్త తరచుగా అనుమాన పడేవాడు. ఈ విషయంలో ఇరుకుటుంబాల పెద్దలు పలుమార్లు మహిళ భర్తకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారని సమాచారం. కానీ భర్త మాత్రం భార్యను తరచుగా అనుమానంతో వేధించేవాడు.
ఈ క్రమంలో వీరి గొడవలు కాస్త పీక్స్ కు వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వీరి మధ్య మరల గొడవలు జరిగాయి. భర్త కత్తితో, ఇనుప రాడ్ తో అత్యంత దారుణంగా భార్యపై దాడి చేశాడు. ఆమె గట్టిగా అరుపులు, కేకలు పెట్టింది. దీంతో చుట్టుపక్కల అపార్ట్ మెంట్ వారు ఉలిక్కి పడి లేచి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ ఇంట్లోంచి భర్త భయంతో బైటకు పరుగులు పెట్టుకుంటూ పారిపోవడం గమనించారు.
Read more: Hyderabad: ఎబోలా కలకలం.. ఒకే ఫ్లైట్‌లో వచ్చిన ముగ్గురిలో లక్షణాలు, గాంధీకి తరలింపు, హెల్త్ డిపార్ట్మెంట్ అలెర్ట్!
అక్కడకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో మహిళ ఉండటంను గమనించారు.వెంటనే పోలీసులు ఘటన స్థలంకుచేరుకుని బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానభూతంతోనే భర్త తన భార్యపై దాడి చేసి హతమార్చినట్లు స్థానికులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.