మంచి జీతం, చేతి నిండా డబ్బు ఉంటేనే జీవితం చాలా సంతోషంగా ఉంటుందని మనలో చాలా మంది భావిస్తుంటారు. అయితే మనం నివసించే నగరాన్ని బట్టి, అక్కడ ఉండే జీవన వ్యయాన్ని బట్టి మనం సంపాదించే డబ్బు విలువ పూర్తిగా
మంచి జీతం, చేతి నిండా డబ్బు ఉంటేనే జీవితం చాలా సంతోషంగా ఉంటుందని మనలో చాలా మంది భావిస్తుంటారు. అయితే మనం నివసించే నగరాన్ని బట్టి, అక్కడ ఉండే జీవన వ్యయాన్ని బట్టి మనం సంపాదించే డబ్బు విలువ పూర్తిగా మారిపోతుందని మీకు తెలుసా? సరిగ్గా ఇదే విషయంపై ఇప్పుడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్ లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో నెలకు రూ. 1.4 లక్షల భారీ జీతం సంపాదించినప్పటి కంటే, తన సొంతూరైన ఉదయ్‌పూర్‌లో కేవలం రూ. 40 వేలు సంపాదిస్తున్నప్పుడే తాను ఎంతో ధనవంతుడిగా, మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతున్నానంటూ ఒక నెటిజన్ షేర్ చేసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
ఆ రెడిట్ యూజర్ తన పోస్ట్‌లో కొన్నేళ్ల క్రితం నాటి తన బెంగళూరు లైఫ్‌ను గుర్తు చేసుకున్నాడు. పేపర్‌పై చూడటానికి నా ఆరు అంకెల జీతం రూ. 1.4 లక్షలు చాలా పెద్ద మొత్తంగా అనిపించేది. కానీ నెలాఖరు వచ్చేసరికి నా బ్యాంక్ అకౌంట్ చూస్తే అంత జీతం తీసుకుంటున్న ఫీలింగ్ అస్సలు ఉండేది కాదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. బెంగళూరు లాంటి మెట్రో సిటీలో కేవలం సాదాసీదాగా బతకడానికే ఎంత భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందో వివరిస్తూ తన నెలవారీ ఖర్చుల లెక్కలను అందరి ముందు పెట్టాడు. ఆ లెక్కలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
బెంగళూరులో కేవలం ఒక సింగిల్ బెడ్రూమ్ (1BHK) ఇంటి అద్దె కోసమే ఏకంగా రూ. 30,000 చెల్లించాల్సి వచ్చేదని అతను పేర్కొన్నాడు. దీనికి తోడు ప్రతి నెలా గ్రోసరీస్, ఇతర నిత్యావసర వస్తువులకు రూ. 6,000 ఖర్చయ్యేవి. ఇల్లు క్లీన్ చేయడానికి పనిమనిషి, బట్టల కోసం లాండ్రీ సర్వీసులకు రూ. 3,000, అలాగే వైఫై కనెక్షన్ మరియు కరెంట్ బిల్లుల రూపంలో మరో రూ. 3,000 చేతిలోంచి వెళ్లిపోయేవి. ఆఫీస్ ఒత్తిడి వల్ల వండుకునే ఓపిక లేక స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే నెలకు రూ. 7,000 బిల్లు వచ్చేది. ఇక రోజువారీ ప్రయాణాలకు క్యాబ్‌లు, ఆటోల కోసం రూ. 5,000, వీకెండ్ వస్తే స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవడానికి, సోషలైజింగ్‌కు రూ. 8,000 ఖర్చయ్యేదని లెక్కలు కట్టాడు.
ఇవి మాత్రమే కాకుండా అమెజాన్ ఆన్లైన్ ఆర్డర్లు, క్విక్ కామర్స్ యాప్స్ అయిన బ్లింకిట్, జెప్టో వంటి వాటి ద్వారా చేసే లగ్జరీ కొనుగోళ్లు, క్యాజువల్ కాఫీల రూపంలో కంటికి కనిపించకుండా చాలా డబ్బులు ఖర్చయిపోయేవి. ఆఫీసులో ఉండే విపరీతమైన మెంటల్ ప్రెజర్ వల్ల అలసిపోయి, కాస్త కంఫర్ట్ కోసం తెలియకుండానే విలాసాలకు ఎక్కువ డబ్బులు తగలేస్తామని ఆ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. అయితే బెంగళూరు నగరాన్ని తాను తక్కువ చేయడం లేదని, ఆ సిటీ తనకు అద్భుతమైన కెరీర్ గ్రోత్, ఎక్స్పోజర్, మంచి నెట్వర్కింగ్ మరియు ఇండిపెండెన్స్‌ను ఇచ్చిందని ఒప్పుకున్నాడు. కానీ ఒక నిర్దిష్ట స్టేజ్ వచ్చాక, ఎంత సంపాదిస్తున్నా మానసికంగా విపరీతమైన అలసట మాత్రమే మిగులుతోందని గ్రహించినట్లు తెలిపాడు.
ఈ క్రమంలోనే అతను మెట్రో లైఫ్‌కు గుడ్ బై చెప్పి తన సొంతూరైన ఉదయ్‌పూర్‌కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ కెరీర్ ప్రారంభంలో కేవలం రూ. 40 వేల చిన్న జీతమే వచ్చినా, బెంగళూరు కంటే ఎంతో రిచ్‌గా అనిపించిందట. సొంత ఇల్లు ఉండటం వల్ల నెలకు రూ. 30,000 అద్దె భారం పూర్తిగా తప్పింది. కుటుంబ సభ్యుల తోడుండటం, ఇంట్లోనే వండిన ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన ఫుడ్ దొరకడం పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఉదయాన్నే ఎలాంటి ట్రాఫిక్ హడావుడి లేకుండా ప్రశాంతమైన వాతావరణం, పెంపుడు జంతువులతో గడిపే సమయం దొరకడంతో నిజమైన మెంటల్ పీస్ లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు. అనవసరపు ఖర్చులు తగ్గడంతో చాలా సులభంగా డబ్బులు సేవ్ అవుతున్నాయని చెప్పాడు.
ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్సీ మాజీ చైర్మన్ పహలాజ్ నిహలానీ కన్నుమూత
Disclaimer: All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent..