
ఓదెల, జూన్ 5: ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల జూనియర్ సివిల్ కోర్టులో శుక్రవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా న్యాయమూర్తిని మొక్కలను
ఓదెల, జూన్ 5: ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల జూనియర్ సివిల్ కోర్టులో శుక్రవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా న్యాయమూర్తిని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళికి లభించిన విలువైన సంపద పర్యావరణం అని, దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు.
ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, సహజ వనరుల సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ధీరజ్ కుమార్ గౌడ్, అడ్వకేట్లు సత్యనారాయణ, అంబాల రాజు, సూపరిండెంట్ ఆసరి శ్రీనివాస్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.