
విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు. విశాఖపట్నం, జూన్ 5: విశాఖ ఏయూ
విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు.
విశాఖపట్నం, జూన్ 5: విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు. తిరుమలలో గ్రీనరీ త్వరలో 90 శాతానికి చేరుకోబోతోందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. విశాఖ ఏయూలో 25 శాతం మాత్రమే గ్రీనరీ ఉందని.. దానిని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు బాగా పెంచిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లంటూ చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. ఆంధ్రా యూనివర్సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అన్నారు. చరిత్ర గల ఈ యూనివర్సిటీ.. ఎంతోమంది నాయకులు, విద్యావేత్తలు, ప్రముఖులను అందించిందని తెలిపారు.
నెట్ జీరో కాన్సెప్ట్‌ను ఏయూలో ప్రవేశపెడుతున్నట్లు సీఎం చెప్పారు. వాతావరణ మార్పులపై అందరూ దృష్టి సారించాలన్నారు. యూనివర్సిటీకి కావాల్సిన 100% విద్యుత్ ఇక్కడి నుంచే ఉత్పత్తి చేయాలన్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో చెట్లను పెంచాలన్నారు. పిల్లలకు ఎక్స్పీరియన్స్ సెంటర్లుగా యూనివర్సిటీలను మార్చాలన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో కమిటీ ఆఫ్ ప్రొఫెసర్స్‌ను పెట్టి ఇన్‌హౌస్ నాలెడ్జీని అభివృద్ధి చేయాలని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ అన్ని ఇతర కాలేజీలను గైడ్ చేయాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారుచేస్తామని తెలిపారు. యాక్షన్ ప్లాన్‌లో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాను కూడా సైకిల్ మీద వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఫొటోల కోసం కాదని.. ఒక అలవాటు కావాలనే ఉద్దేశంతోనే సైకిల్‌పై వెళ్తున్నట్లు తెలిపారు. సైకిల్ తొక్కడం వలన ఎక్సర్సైజ్, ఫిట్నెస్ రెండూ అవుతాయన్నారు. ఏపీలో 33% గ్రీన్ కవర్ ఉందని.. దీన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు. నెట్ జీరో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని.. దీన్ని ఒక ఆదర్శంగా చేస్తామని సీఎం అన్నారు. నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా సైకిల్‌పై నోవాటెల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు.
పర్యావరణ దినోత్సవం.. తిరుమలలో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి: రామ్మోహన్ నాయుడు