
రైతుభరోసా పెండింగ్ నిధుల కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. మూడు విడతల్లో నిధుల జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. రెండు విడతలుగా రెండు ఎకరాలకు నిధులు జమ చేసారు. అయితే, దాదాపు నెల రోజులు అయినా..
రైతుభరోసా పెండింగ్ నిధుల కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. మూడు విడతల్లో నిధుల జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. రెండు విడతలుగా రెండు ఎకరాలకు నిధులు జమ చేసారు. అయితే, దాదాపు నెల రోజులు అయినా.. ఇంకా మూడో విడత నిధులు జమ చేయలేదు. అటు రైతులు యాసంగి సాగును పూర్తిచేసుకొని, వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం లోని ముఖ్యుల వద్ద మూడో విడత నిధుల పైన కీలక చర్చ సాగుతోంది.తెలంగాణలో మూడో విడత రైతు భరోసా నిధుల జమ కోసం రైతులు వేచి చూస్తున్నారు. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ భరోసా నిధులను విడుదల చేసారు. తొలి విడతగా రూ.3,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరో 20 రోజుల్లో రూ.2,650 కోట్లు రెండో విడతగా జమ చేస్తామని, ఏప్రిల్‌ ఆఖరు వరకు రైతులందరికీ రైతుభరోసా కింద రూ. 9వేల కోట్లు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. అయితే, ఏప్రిల్‌ 20న రెండో విడత కింద ప్రభుత్వం రూ.2,063 కోట్లు విడుదల చేసింది. రెండో విడత పంపిణీ చేసి నెలన్నర అవుతున్నా.. మిగిలిన రైతుభరోసాపై ఎలాంటి అప్డేట్ లేదు. రెండు విడతల్లో కలిపి రూ.5,510 కోట్లు పంపిణీ చేసింది. వాస్తవానికి రైతుభరోసా కింద రూ. 9వేల కోట్లు పంపిణీ చేయాలి. అంటే ఇంకా రూ.3,490 కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది.జగన్ కు ఈడీ నోటీసులు, మళ్లీ మొదలు..!?రెండో వారంలో నిధులకు అవకాశం..? ఇక, రుతుపవనాల రాకతో వానకాలం ప్రారంభమైంది. రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రెండు విడతల్లో విడుదల చేసిన నిధుల తరువాత 20 రోజుల్లో రూ.2,650 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ నెలాఖరులోగా మిగిలిన రైతుల ఖాతాల్లోకి మిగిలిన నిధులను బదిలీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మే నెల పూర్తి చేసుకొని ... జూన్ లో తొలకరి ప్రారంభ సమయం వచ్చేసింది. ఇప్పటికీ నిధుల విడుదలపైన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సమయంలోనే పెండింగ్ నిధుల పైన ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వకు క్షేత్ర స్థాయిలో రైతు నిరీక్షణ గురించి వివరించారు. దీంతో.. వచ్చే వారం పెండింగ్ నిధులు విడుదల చేస్తారని చెబుతున్నారు. దీని పైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.