
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు తితిదే ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్రమంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు పీయూష్ గోయల్‌కు ఆశీర్వచనం చేయగా.. అధికారులు ప్రసాదాలను అందజేశారు. అనంతరం పద్మావతి అతిథి గృహం సమీపంలో తితిదే ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ దినోత్సవంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అద్భుత సదుపాయమని ఆయన కొనియాడారు. ఈ వార్త చదివారా: 2.5కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్