
ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఢీ’ డ్యాన్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన పండు మాస్టర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఢీ’ డ్యాన్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన పండు మాస్టర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆయనకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. పండు మాస్టర్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.ప్రమాద విషయం తెలియగానే పల్లా శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. పండు మాస్టర్ సన్నిహితులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చుల గురించి ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం డాక్టర్లతో తాను స్వయంగా మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోన్ సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే మంచి మనసుపై నెటిజన్లు, పండు మాస్టర్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆరోగ్యం నిలకడగా ఉంది: వైద్యులుప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ప్రమాదంలో ఆయన నడుము కింది భాగంలో జాయింట్ డిస్లొకేషన్ కాగా, శస్త్రచికిత్స ద్వారా దాన్ని సరిచేసినట్లు వెల్లడించారు. అయితే, ఆయన రెండు కాళ్లకు కూడా సర్జరీలు చేయాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్సల అనంతరం పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల విశ్రాంతి అవసరమని, ఆ తర్వాత ఆయన మళ్లీ యధావిధిగా డ్యాన్స్ చేయవచ్చని వైద్య బృందం స్పష్టం చేసింది. ఈ వార్తతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు కాస్త