
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. FIFA World Cup June 11 to 19: ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఫుట్ బాల్ టోర్నమెంట్ తొమ్మిది రోజుల పాటు అభిమానులను అలరించబోతోంది. 90 నిమిషాలపాటు సాగే ఆటలో అడుగడుగునా ఆసక్తి… శక్తి సామర్థ్యాలను ఒడ్డి గోల్ కొట్టేందుకు ప్రయత్నించే ఆటగాడు.. మొనగాడిగా నిలిచే సందర్భం చూసేవారికి ప్రత్యేక అనుభూతినిస్తుంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు ఆతిథ్యమిస్తున్నాయి. 9 రోజుపాటు సాగే ఫుట్ బాల్ సమరంలో 48 దేశాల జట్లు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఫిఫా వరల్డ్ కప్ ప్రత్యక్ష ప్రసార హక్కులను మీడియా దిగ్గజం జీ నెట్వర్క్ సొంతం చేసుకుంది. టోర్నమెంటు ప్రారంభానికి 10 రోజుల ముందుగా మీడియా ప్రసార ఒప్పందం ఖరారైంది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా ప్రసార సంస్థలు పోటీపడినప్పటికీ.. జీ నెట్వర్క్ ప్రసార హక్కులను సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. 104 మ్యాచులతో అలరించబోతున్న ఫిఫా 2026.. ఆటలో వైవిధ్యం.. ప్రతిభా సామర్థ్యాలతో ఫుట్ బాల్ స్టార్ ఆటగాళ్లుగా నిలిచిన మెస్సీ… రొనాల్డ్… ఎంబాపే.. యమాల్… ఫుట్ బాల్ విన్యాసాలతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేయబోతున్నారు. 11 మందితో జట్టుగా దిగే ఆటలో ప్రత్యర్థి జట్టుపై పట్టుసాధించే తీరు ఐక్యతను సంకేతంగా నిలుస్తుంది. ఆటగాడిలో చురుకుదనం, సమయస్ఫూర్తి, వ్యక్తిగత ప్రతిభా సామర్థ్యాలు ఆటలో ముడిపడి ఉంటాయి. పేద దేశాలు… సంపన్న దేశాలు.. ఫుట్ బాల్ టోర్నమెంటు అంటేప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. తారతమ్యాల్లేని విధంగా ఫుట్ బాల్ అన్ని
దేశాల్లోకి చొచ్చుకెళ్లిన ఆటగా ఫుట్ బాల్ నిలిచింది. గతంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ వేరు… 2026లో జరగబోతున్న ఫిఫా టోర్నమెంటు ప్రత్యేకతను సంతరించుకుంది. ఇన్నాళ్లు అత్యధికంగా 32 జట్లు పోటీ పడే టోర్నమెంటులో ఈ సారి 48 జట్లు పోటీపడుతున్నాయి. దీంతో మెగా టోర్నమెంటుగా ఫిఫా నిలిచింది. 64 మ్యాచులనుంచి 104 మ్యాచులతో ఫిఫా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సీజన్ కు ఆతిథ్యమిస్తున్న అమెరికా, మెక్సికో, కెనడా.. ఫిఫా వరల్డ్ టోర్నమెంటును తొలిసారిగా మూడు దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. అమెరికా, మెక్సికో, కెనడా ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చే టోర్నమెంటు ప్రత్యేకతను సంతరించుకుంది. 16 నగరాల్లోని ఫుట్ బాల్ వేదికలపై మ్యాచ్ లు అలరించబోతున్నాయి. అమెరికాలో 11, మెక్సికోలో మూడు, కెనడాలో రెండు నగరాల్లో ఫుట్ బాల్ వేదికలు 9 రోజుల పాటు ఉత్సాహభరిత వాతావరణంలో మ్యాచ్ లు కిక్కెక్కించ బోతున్నాయి. మూడు దేశాల్లోనూ ప్రతి ప్రారంభ మ్యాచ్ కు ముందు ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించేలా సన్నాహాలు పూర్తిచేశారు. 2026 ప్రపంచకప్ తొలి మ్యాచ్ మెక్సికో సిటీలో జరుగుతుంది. ఫైనల్‌కు జులై 19న న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం వేదికగా జరుగుతుంది.
ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నమెంటులకు ఆతిథ్యమిచ్చే దేశాల్లో మెక్సికో సరికొత్త రికార్డును సొంతం చేసుకోబోతోంది. 1970, 1986, 2026 సీజన్లలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్ కు ఆతిథ్యమిచ్చే దేశంగా చరిత్రలో నిలిచిపోతోంది. 2026 ప్రపంచ కప్‌లో ఫైనల్ సహా అత్యధిక మ్యాచ్‌లకు అమెరికా ఆతిథ్య మిస్తోంది.
ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలకోసం ఎదురు చూస్తున్న ప్రపంచ దేశాలు.. ఒకప్పుడు ప్రపంచ విజేతగా నిలిచిన ఇటలీ.. ఇపుడు మెగా టోర్నీకి దూరమైంది. ఫుట్ బాల్ లో మేటి జట్టుగా నిలిచిన ఇటలీ వరుసగా మూడోసారి ఫిఫా మెగా టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైంది. ఓ మాజీ ఛాంపియన్ వరుసగా మూడు సార్లు ప్రపంచ కప్‌నకు దూరమైంది. ఇటలీ అర్హత కోల్పోవడంతో ఫుట్‌బాల్ అభిమానుల విచారం వ్యక్తంచేశారు. ఇటలీ ఫుట్ బాల్ జట్టు 1934, 1938, 1982, 2006 సీజన్లలో నాలుగుసార్లు ప్రపంచ విజేతగా నిలిచి రికార్డును సొంతం చేసుకుంది. అలాంటి జట్టు వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య నుంచి మొత్తం 8 జట్లు ప్రపంచకప్‌లో పోటీపడుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, ఉజ్బెకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వీటిలో జపాన్‌కు అత్యుత్తమ ఫిఫా 18వ ర్యాంకు ఉంది.
ఫిఫా ప్రపంచకప్‌నకు తొలిసారి అర్హత సాధించి నాలుగు దేశాలు చరిత్ర సృష్టించాయి. కేప్ వెర్డ్, కురసావ్, జోర్డాన్, ఉజ్బెకిస్థాన్‌తో 2026 ప్రపంచకప్ టోర్నమెంటులో అడుగుపెట్టబోతున్నాయి. ఈ టోర్నమెంట్లో జట్ల సంఖ్యను పెంచడం ఈ దేశాలకు కలిసి వచ్చింది. ఆతిథ్య దేశం హోదాలో గత సీజన్లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న ఖతార్.. ఈసారి క్వాలిఫయింగ్ ద్వారా అర్హత సాధించింది. కల్లోల ఇరాక్ కూడా ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. 1986 తర్వాత ఇరాక్ ఫుట్ బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఫుట్ బాల్ పోటీల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఫ్రాన్స్, అర్జెంటీనా, బ్రెజిల్, ఇంగ్లాండ్, స్పెయిన్ హోరాహోరీ పోరుకు తలపడి సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాయి. అమెరికా హోమ్ గ్రౌండ్స్ కావడంతో USA, మెక్సికో జట్లు సంచలనాలు సృష్టించేందుకు ఎదురు చూస్తున్నాయి.
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 జీ5, టీవీలో ఎలా చూడాలి ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి