
ఇంటర్నెట్ డెస్క్: భారత వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కెరీర్లో తనకు అండగా నిలిచిన బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, కోచ్‌లు, సహచర ఆటగాళ్లకు భరత్ కృతజ్ఞతలు తెలిపాడు. ఏపీకి చెందిన 32 ఏళ్ల భరత్ టీమ్ఇండియా తరఫున ఏడు టెస్టులు ఆడి 221 పరుగులు చేశాడు. ఇందులో ఐదు మ్యాచ్‌లు ఆస్ట్రేలియాతో, రెండు మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌తో ఆడాడు. 2023 బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి వికెట్ కీపర్-బ్యాటర్‌గా 2015లో రికార్డు నమోదు చేశాడు. అదే సంవత్సరం ఐపీఎల్ వేలంలో దిల్లీ డేర్‌డెవిల్స్ భరత్‌ను రూ.10 లక్షలకు దక్కించుకుంది. ఆ తర్వాత ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.