
Rishabh Pant: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన బ్యాటింగ్ శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడే విధానాన్ని మార్చుకోవాలని టీమ్ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సూచించాడు. అఫ్గానిస్థాన్‌తో శనివారం ప్రారంభం కానున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంత్ వైస్ కెప్టెన్సీ మార్పు, ఫామ్‌పై డష్కాటే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read also: IPLలో ఫిక్సింగ్? లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
గత నెలలో అఫ్గానిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ కోసం జట్టును ప్రకటించిన సమయంలో బీసీసీఐ (BCCI) రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అసిస్టెంట్ కోచ్ స్పందిస్తూ.. వైస్ కెప్టెన్ పదవి నుంచి తీసేయడంపై పంత్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అతడు ఈ మార్పును చాలా సానుకూలంగా తీసుకున్నాడు. నాయకుడిగా ఎదగడానికి అధికారికంగా ఎలాంటి పదవులు అవసరం లేదు అని డష్కాటే స్పష్టం చేశాడు. ఆటలో జట్టు పరిస్థితిని బట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడంపైనే పంత్ దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డాడు.
రిషభ్ పంత్ ఇప్పటివరకు 49 టెస్టుల్లో 42.91 సగటుతో మొత్తం 3,476 పరుగులు సాధించాడు. అతడి దూకుడుగా ఆడే శైలి భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించినప్పటికీ.. కొన్నిసార్లు అనవసరమైన షాట్లు ఆడి వికెట్ పారేసుకుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో కేవలం 12.25 సగటుతో 49 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ టెస్టులో అతడి బ్యాటింగ్ విధానంపై కోచింగ్ స్టాఫ్ కీలక సూచనలు చేసింది.
వైస్ కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ అఫ్గానిస్థాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో పంత్ కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌కు యువ స్టార్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.
Peddi movie: ఆ రెండేళ్ల కష్టమే ఈ బ్లాక్ బస్టర్.. పెద్ది సినిమాపై చిరంజీవి ఆసక్తికరమైన ట్వీట్!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Virat Kohli: టీమ్ఇండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం!
IPLలో ఫిక్సింగ్? లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
IPL చరిత్రలోనే తొలిసారి అరుదైన రికార్డ్స్ ఈ ఏడాది నమోదు
Shreyas Iyer : సూర్యకు షాక్?.. టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?
Pat Cummins: SRHకు బిగ్ షాక్.. ఐపీఎల్-2027కు పాట్ కమ్మిన్స్ దూరం?
FIFA World Cup 2026: ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్ మూలాలున్న ముగ్గురు ఆటగాళ్లు!