
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. తొడ కండరాల గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలుగుతాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా అఫ్గాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్ఇండియా ఆడనుంది. జూన్ 13 నుంచి జూన్ 20 వరకు మూడు మ్యాచుల్లో ఇరు జట్లూ తలపడతాయి. భారత్ తరఫున కేవలం వన్డేల్లోనే కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. విరాట్ కోహ్లీ ఆ జట్టులో టాప్ స్కోరర్. ఫైనల్లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ (75 పరుగులు నాటౌట్)తో ఆర్సీబీని గెలిపించాడు. అయితే, గుజరాత్‌తో తుది పోరు సమయంలో కోహ్లీ నొప్పితో బాధపడటం చూశాం. ఫిజియోతో సపర్యలు చేయించుకొని మరీ చివరివరకూ క్రీజ్‌లో నిలబడ్డాడు. ఆర్సీబీకి రెండో కప్పును అందించాడు.
అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య కూడా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరూ తమ ఫిట్‌నెస్‌కు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు రోహిత్ శర్మ సీఓఈకి వెళ్లలేదని తెలుస్తోంది. మరో వారం రోజుల్లోనే వన్డే సిరీస్ మొదలు కానున్న నేపథ్యంలో.. రోహిత్ ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. ఫిట్నెస్ నిరూపించుకోకపోతే అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడే అవకాశాలు లేనట్లే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.