
Motorola Edge 70 Pro+ | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా (Motorola) తన ఎడ్జ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎడ్జ్ 70 ప్రో+ (Motorola Edge 70 Pro+) పేరిట ప్రీమియం సెగ్మెంట్లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. 6500mAh బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ధర, ఇతర వివరాలు ఇవీ..
Motorola Edge 70 Pro+ సింగిల్ వేరియంట్లో వస్తోంది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.47,999గా కంపెనీ నిర్ణయించింది. మూడు రంగుల్లో లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కు రూ.3వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. లేదా ఎక్స్చేంజీ బోనస్ కింద రూ.3 వేలు పొందొచ్చు. జూన్ 11 నుంచి ఫ్లిప్‌కార్డ్, మోటోరొలా వెబ్సైట్, సంబంధిత రిటైల్ స్టోర్లలో విక్రయానికి రానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.