
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�...
లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అన్నం పెట్టే నేల... అన్నం పెట్టే పంట అన్నం పండించే చేయి... అన్నపూర్ణలు. ఆహారం విషతుల్యం అవుతున్న ఈ రోజుల్లో తనే ఒక అన్నపూర్ణగా ఎందుకు కాకూడదు అనుకుందో అమ్మాయి. ‘హైడ్రోపోనిక్ రైతు’గా మారి బాల్కనీలోనే తన ఆహారం తానే పండించుకుంటోంది.
కోల్‌కతా అమ్మాయి వంశికా ఝావర్ మార్గంలో నడిస్తే మరెందరో అన్నపూర్ణలవుతారు. ‘కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ’ లో ఇంజినీరింగ్ చదువుకుంటున్న 22 ఏళ్ల వంశికా ఝావర్కు ఆరోగ్యం బాగుండటం లేదు. డాక్టర్ దగ్గరకు వెళితే ‘పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్’ అన్నారు.
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.
తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం.
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు.
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�...
బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�...
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�...
సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�...
లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ...
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �...
సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�...
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున...
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద...
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు.
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
Jun 4 2026 5:59 AM | Updated on Jun 4 2026 5:59 AM
అన్నం పెట్టే నేల... అన్నం పెట్టే పంట అన్నం పండించే చేయి... అన్నపూర్ణలు. ఆహారం విషతుల్యం అవుతున్న ఈ రోజుల్లో తనే ఒక అన్నపూర్ణగా ఎందుకు కాకూడదు అనుకుందో అమ్మాయి. ‘హైడ్రోపోనిక్ రైతు’గా మారి బాల్కనీలోనే తన ఆహారం తానే పండించుకుంటోంది. కోల్‌కతా అమ్మాయి వంశికా ఝావర్ మార్గంలో నడిస్తే మరెందరో అన్నపూర్ణలవుతారు.
‘కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ’ లో ఇంజినీరింగ్ చదువుకుంటున్న 22 ఏళ్ల వంశికా ఝావర్కు ఆరోగ్యం బాగుండటం లేదు. డాక్టర్ దగ్గరకు వెళితే ‘పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్’ అన్నారు. ఆ తర్వాత పరీక్షలు చేసి ‘పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్’ అని పిలిచే పీఓఎంఎస్గా నిర్ధారణ చేశారు. ‘ఇప్పుడు నేనేం చేయాలి’ అని అడిగింది వంశిక. ‘నువ్వు తినే తిండిలోనే విషం ఉంది. నీ జీవనశైలి మార్చుకో. హై్రపోటీన్, లోకార్బ్ ఆహారం తీసుకో, ప్రాసెస్ చేసిన షుగర్ వద్దు’ ఇలా సూచనలు చేశాడు డాక్టర్. అప్పటికే వంశిక మందులతో విసిగిపోయింది. ఆరోగ్యంగా బతకాలంటే ఏం చేయాలి అనుకుంది.
సాగిన శోధన మనం తింటున్న ‘ఫ్రెష్’ కూరగాయలు నిజంగా ఫ్రెష్షేనా అని డౌట్ వచ్చింది వంశికాకు. పరిశీలిస్తే అవి గ్రోత్ హార్మోన్లు, పురుగు మందులు, ఎరువులతో నిండి ఉన్నాయని అర్థమైంది. ‘మనకు తాజా కూరగాయలు దొరకడం పెద్ద సవాలు. అందుకే మనమే రసాయనం లేకుండా తిండి పండించుకోవాలి అనిపించింది. అలా హైడ్రోపోనిక్ వ్యవసాయం వైపు అడుగేశా’ అని ఆమె చెబుతోంది వంశిక. ‘హైడ్రోపోనిక్స్’ అంటే మట్టి లేకుండా, నీటిలో పోషకాలు కలిపి మొక్కలు పెంచే పద్ధతి. స్థలం సమస్య, నీటి కొరత సమస్య, వాతావరణం అనిశ్చితి... ఈ మూడు పెద్ద సమస్యలకు ఇది ఒక్కటే సమాధానం అని వంశిక నమ్మింది. నగరాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఏడాది పొడవునా తిండి పండించేలా తక్కువ ఖర్చుతో కూడిన మైక్రో–ఫామ్‌ను డిజైన్ చేసింది. ఒక రకంగా ఇది ప్రాజెక్ట్ కాదు, తన ఆరోగ్యం కోసం తను మొదలుపెట్టిన పోరాటం.
అదిగో అన్నపూర్ణ వంశిక తన ఇంటి బాల్కనీనే పొలం చేసింది. పేరు ‘అన్నపూర్ణ’ అని పెట్టింది. పెట్టుబడి సున్నా. సాధనాలుగా కన్ స్ట్రక్షన్ సైట్లో పారేసిన పైపులు వాడింది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టింది. కొంచెం డబ్బు హైడ్రోపోనిక్ సొల్యూషన్స్, విత్తనాల కోసం మాత్రమే ఖర్చు చేసింది. ‘నా మొదటి పెట్టుబడి దాదాపు జీరో’ అంటుంది వంశిక.
అందరూ అందుకోవాల్సిన హైడ్రోపోనిక్స్ భారతదేశంలో హైడ్రోపోనిక్స్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా, నెమ్మదిగా ప్రజాదరణ పొందుతోంది. సంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే ఈ పద్ధతిలో 95 శాతం నీరు ఆదా అవుతుంది. 30 శాతం అధిక దిగుబడి వస్తుంది. నేల అవసరం లేదు కాబట్టి పురుగుమందుల వాడకం తగ్గుతుంది. నగరాల్లోని బాల్కనీలో, ఇంటి పైకప్పు మీద కూడా కూరగాయలు పండించుకోవచ్చు. ఆరోగ్య సమస్యతో బాధపడే లక్షలాది మంది మహిళలకు, కల్తీ ఆహారానికి భయపడే ప్రతి కుటుంబానికి ఇది ఒక భరోసా. జీవనశైలి జబ్బులకు మాత్రల కంటే ప్లేట్లో ఉండే తిండే పెద్ద మందు. ఆ తిండిని స్వచ్ఛంగా, మన చేత్తో పండించుకునే మార్గాన్ని వంశిక చూపిస్తోంది. కోల్‌కతాలోని చిన్న బాల్కనీలో మొదలైన ‘అన్నపూర్ణ’ రేపు దేశంలోని ప్రతి ఇంట్లో ప్రతిధ్వనిస్తే, అదే అసలైన వ్యవసాయ విప్లవం. ∙
మొదట ఆకుకూరలు వంశిక మొదట ఆకుకూరలతో మొదలుపెట్టింది. ఎందుకంటే అవి తేలికగా పెరుగుతాయి. రెండు నుంచి మూడు వారాల్లో కోతకు వస్తాయి. తన మొదటి పంటను ల్యాబ్‌లో పరీక్ష చేయించింది. ఫలితాలు అద్భుతం. సంప్రదాయ వ్యవసాయంలో పండిన వాటి కంటే హైడ్రోపోనిక్ పంటలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు కూడా చెబుతున్నాయని ఆమె గర్వంగా చెబుతోంది. తన ప్రయోగం సక్సెస్ అయ్యాక ఆమె ఆలోచనలు కుంకుమ పువ్వు వైపు మళ్లాయి. ఖరీదైన పంట అయిన శాఫ్రాన్ ను కూడా హైడ్రోపోనిక్స్‌లో పండించవచ్చనీ, అది తన తదుపరి లక్ష్యం అనీ చెబుతోంది.
ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు)
చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు)
'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు)
'కాక్టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్...రష్మిక సందడి (ఫొటోలు)
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు సంచలన కామెంట్స్
అన్నా నువ్వే మాకు దిక్కు... బాధపడకు అమ్మా.. ఎలా న్యాయం జరగదో నేనూ చూస్తా..!
Viral Video: మేం ఏ తప్పు చెయ్యలేదు.. కావాలనే ఆ ముగ్గురు చేస్తున్నారు
నువ్వేంటో, నీ స్థాయేంటో తెలుసుకో..! పవన్ పై అడ్వకేట్స్ కేసు
జగన్ ముందే జీవోలన్నీ గుక్కతిప్పుకోకుండా చెప్పిన.. డీఎస్సీ అభ్యర్థి!