
ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) స్వాగతం పలికింది.
అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వహణకు రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ముకేశ్ అంబానీ తన కుటుంబ సభ్యులలో కలిసి తొలుత బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కేదార్నాథ్ ఆలయానికి వెళ్లారు.
ఆలయాభివృద్ధికి, యాత్రికులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ఆయన రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారని బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రానా తెలిపారు. ఏటా బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను ముకేశ్ అంబానీ సందర్శిస్తుంటారు.
మరోవైపు ఛార్‌దామ్ యాత్ర కొనసాగుతోంది. జూన్ 13 వరకు 12.23 లక్షల పైగా యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించగా, బద్రీనాథ్ ఆలయాన్ని 10.92 లక్షల భక్తులు సందర్శించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.