
బ్రింగా హెయిర్ గ్రోత్ సీరమ్‌పై జరిపిన రెండో భారీ-స్థాయి క్లినికల్ అధ్యయనం విజయవంతంగా పూర్తయినట్లు ఇందులేఖ ప్రకటించింది. దీంతో భారతదేశపు మొట్టమొదటి క్లినికల్ పరీక్షలు జరిపిన ఆయుర్వేద హెయిర్ గ్రోత్ సీరమ్‌గా దీని స్థానం మరింత పటిష్ఠమైంది.
2024లో పూర్తి చేసిన మునుపటి ట్రయల్ ఫలితాల ఆధారంగా.. 2025లో మరోసారి అధ్యయనం నిర్వహించారు. ఈ రెండు స్వతంత్ర క్లినికల్ అధ్యయనాలు.. జుట్టు పెరుగుదల, సాంద్రత, తలచర్మ ఆరోగ్యంలో మెరుగుదలను ప్రదర్శించాయి. తాజా ఫలితాల ప్రకారం.. ఇందులేఖ బ్రింగా హెయిర్ గ్రోత్ సీరమ్ 90 రోజుల్లో 11,000 కంటే ఎక్కువ కొత్త వెంట్రుకలను పెంచింది.
తలచర్మ (Scalp) సీరమ్ విభాగంలో సాధారణంగా ఉపయోగించే పదార్థమైన 3 శాతం రెడెన్సిల్ కలిగిన సీరమ్ల కంటే 2 రెట్లు ఎక్కువ జుట్టు పెరుగుదలను నమోదు చేసింది. అనజెన్-టు-టెలోజెన్ (A:T) నిష్పత్తిలో 74% మెరుగుదల కూడా నమోదైంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.
చర్మవ్యాధి నిపుణులు, ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో, రిజిస్టర్డ్ క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ అధ్యయనాలు నిర్వహించారు. ఈ క్లినికల్ పరీక్షల్లో పాల్గొన్న వారిలో ప్రారంభం నుంచి మధ్య స్థాయి వరకు జుట్టు పల్చబడటాన్ని ఎదుర్కొంటున్న 20 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు ఉన్నారు.
పరిశోధకులు కొత్త జుట్టు పెరుగుదల, జుట్టు రాలడం, ఫోలికల్ బలం, జుట్టు సాంద్రత, తలచర్మ రక్షణ పొర పనితీరు వంటి కీలక పారామితులను మూల్యాంకనం చేశారు. వినియోగదారుల అభిప్రాయం ఈ ఫలితాలను మరింత బలపరిచింది. ఇందులో పాల్గొన్న వారందరూ తమ జుట్టు ఒత్తుగా కనిపించడాన్ని గమనించగా..
97 శాతం మంది జుట్టు రాలడం తగ్గడం, జుట్టు సాంద్రత మెరుగుపడటం, జుట్టు మందం, ఒత్తు స్పష్టంగా పెరగడం గమనించామని చెప్పారు. ‘‘రెండు సంవత్సరాల పాటు రెండు స్వతంత్ర క్లినికల్ ట్రయల్స్‌తో, ప్రామాణికమైన ఆయుర్వేద ఫార్ములేషన్లను కఠినమైన శాస్త్రీయ ధ్రువీకరణతో మిళితం చేసి, ఉత్పత్తి సామర్థ్యంపై
వినియోగదారులకు మరింత విశ్వాసాన్ని కలిగించడమే మా లక్ష్యం’’ అని హెచ్‌యూఎల్ హెయిర్‌కేర్ విభాగాధిపతి సాయిరామ్ సుబ్రమణియన్ అన్నారు. 2024 అధ్యయనం ఫలితాలు ఇప్పటికే ప్రచురించగా.. 2025 ట్రయల్ ఫలితాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ డెర్మటాలజీకి సమర్పించారు. క్లినికల్ పరిశోధనపై తమ నిరంతర దృష్టి, కాలపరీక్షకు నిలిచిన ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక చర్మవ్యాధి శాస్త్రంతో మిళితం చేయాలనే తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఇందులేఖ పేర్కొంది.
గమనిక: ఈ కంటెంట్ ఓ వ్యాపార ప్రకటన మాత్రమే. ఇందులోని ఉత్పత్తులు, సేవలు, వాటిపై వ్యక్తమైన అభిప్రాయాలు, సూచనలకు సంబంధించి పాఠకులు తగిన జాగ్రత్త వహించి విచారణ చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవలకు సంబంధించిన నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.