
ఇథియోపియాలోని అంహార రీజియన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. డెస్సీ నుంచి అడీస్ అబాబాకు ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఘటనాస్థలిలో ప్రాథమిక వైద్య, అంబులెన్స్ సేవలు లేకపోవడంతో క్షతగాత్రులను ప్రజా రవాణా వాహనాల్లో తరలించారు.
దీంతో మరణాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 31మంది మృతి
|