
మేడ్చల్ జిల్లా కీసర పోలీసుస్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ కోసం ఫొటోషూట్‌కు వచ్చిన ముగ్గురు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ జిల్లా, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లా కీసర పోలీసుస్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇన్స్టాగ్రామ్ కోసం ఫొటోషూట్‌కు వచ్చిన ముగ్గురు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం గ్రామంలోని బాణమ్మ చెరువు వద్ద సరదాగా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు వచ్చిన ఆంటోనీ (18), జోసెఫ్ (18), టోనీ (17) ప్రమాదానికి గురయ్యారు. ఫొటోషూట్ సందర్భంగా నీటిలో పడిపోయిన హెడ్‌ఫోన్స్ తీసుకురావడానికి చెరువులోకి దిగిన యువకులు ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతయ్యారు.
మృతులంతా బొల్లారం ప్రాంతానికి చెందిన స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేక ఫొటోలు దిగేందుకు చెరువు వద్దకు వచ్చిన వీరు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికితీశారు.
మరో యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సరదాగా వెళ్లిన ముగ్గురు స్నేహితులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
సోషల్ మీడియా కోసం ప్రాణాలకు ముప్పు కలిగించే సాహసాలకు దూరంగా ఉండాలని మేడ్చల్ జిల్లా పోలీసులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు చిన్న తప్పులకూ ఉద్యోగ బహిష్కరణ సరికాదు: సుప్రీంకోర్టు
Read Latest Telangana News And AP News And National News