
ఇద్దరు అమ్మాయిల పరిచయం ఒకసారి ప్రేమలా మరోసారి స్నేహంలా అనిపిస్తుంటే.. నిజంగా వాళ్లతో తనకున్న బంధమేంటో తేల్చుకోలేక తనలో తానే మదన పడిపోతున్నాడో యువకుడు. అలా వారితో బంధంలో స్పష్టత లేకుండా దోబూచులాడుతూ సరదాగా సాగిపోతున్న తన జీవితంలో ప్రేయసిని నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది. అప్పుడు తనకు ఎదురైన సవాళ్లేంటి? ఇద్దరిలో ఎవరిని స్నేహం పేరుతో బాధపెట్టాడో తెలియాలంటే ముక్కోణపు ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ‘కాక్టెయిల్ 2’ సినిమా చూడాల్సిందే. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కథానాయికలు రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. హోమీ అడజానియా తెరకెక్కించారు. దినేష్ విజన్, లవ్ రంజన్ తదితరులు నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది. ‘‘కొత్తగా పరిచయమయ్యే స్నేహితులు కొత్తగా అనిపిస్తారు.. వారి కథలు కొత్తవి కాబట్టి. పాత స్నేహితుల కథలు విసుగు పుట్టిస్తాయి. కానీ, ప్రేమ ఉన్నట్టుండి స్నేహంలా అనిపిస్తే..’ లాంటి సంభాషణలతో సాగే ఈ ట్రైలర్ నాయకానాయికల మధ్య ఉంది ప్రేమా.. స్నేహమా అనే ప్రశ్నలతో ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఆకట్టుకుంటుంది. ‘వాళ్లు ఎప్పుడూ వార్తల్లో నిలవలేదు.. ఈ రోజు వారే ఓ కథగా మారబోతున్నారం’టూ తన రాబోయే కొత్త చిత్రం ‘భారత భాగ్య విధాత’ ప్రపంచాన్ని పరిచయం చేసింది బాలీవుడ్ కథానాయిక కంగన. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కంగన, శైలేష్ ఆర్.సింగ్ తదితరులతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా సామాజిక మాధ్యమాల్లో అధికారిక ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్లకు ధైర్యం చెబుతూ, ఎప్పుడూ తమ కబుర్లతో నవ్విస్తూ ఉండే ఆసుపత్రి సిబ్బందిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది ఉగ్రదాడి.
.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
© 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.