నిమిషం.

ప్రతి నిమిషం... ప్రతి వార్త.

TeluguEnglishHindiKannada

విభాగాలు

  • తాజా వార్తలు
  • సినిమా
  • రాజకీయాలు
  • క్రీడలు
  • టెక్

మార్కెట్లు

  • Stock Market
  • Business
  • Gold Rates
  • Silver Rates

సినిమా

  • Movies Directory
  • Movie Reviews
  • Collections
  • Hit or Flop
  • Box Office

Govt Portals

  • Meebhoomi
  • MeeSeva
  • Dharani
  • Results 2025
  • AP Schemes
  • TS Schemes
  • Electricity Bill
  • TTD Tickets
  • Voter ID
  • PM Kisan
  • Ration Card
  • Vehicle Check

Links

  • Publishers
  • News Sitemap
  • RSS Feed
  • Govt Services

మా గురించి

  • About Us
  • Contact Us
  • Promotions
  • Privacy Policy
  • Terms
  • Admin

Promotions & Advertising

hello@xpeto.in

Call / WhatsApp

+91 72599 96233
📣 Advertise with Us
© 2026 nimisham.in · All rights reserved · hello@xpeto.in
నిమిషం.

Select Language

తెTeluguEnEnglishहिHindiಕKannada

Categories

Latest
Movies
Politics
Sports
Collections
Reviews
Hit or Flop
Stocks
Business
Tech
Govt
నిమిషం.ప్రతి నిమిషం... ప్రతి వార్త.
LatestMoviesPoliticsSportsCollectionsReviewsHit or FlopStocksBusinessTechGovt
TeluguEnglish
Language
తెTeluguEnEnglishहिHindiಕKannada
LatestMoviesPoliticsSportsCollectionsReviewsHit or FlopStocksBusinessTechGovt

మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు

Andhra Jyothy2 Jun 2026, 3:08 pm
Share
X
మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు

కోల్‌కతా: 'పోరాటమో.. మరణమో' తేల్చుకుంటామంటూ టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మంగళవారంనాడు కోల్‌కతాలో భారీ ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి రోడ్లపైకి వచ్చారు. పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయినప్పటికీ 80 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలను మమతా బెనర్జీ ఇటీవల సస్పెండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 78కి చేరింది. వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు... నయన దాస్ బెనర్జీ, మదన్ మిత్రా, ఫిర్హాద్ హకీమ్, బిమన్ బెనర్జీ, అశోక్ దేబ్, సోవన్‌దేబ్ చటోపాధ్యాయ్ మాత్రమే మమతా బెనర్జీ నిరసన దీక్షలో పాల్గొన్నారు. టీఎంసీకి పార్లమెంటు ఉభయసభల్లో 41 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఐదుగురు ఎంపీలు..డెరిక్ ఒబ్రెయిన్, సమీరుల్ ఇస్లామ్, దోలా సేన్, మాలా రాయ్, కల్యాణ్ బెనర్జీ మాత్రమే నిరసన వేదిక వద్ద కనిపించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన చాంద్రిమ భట్టాచార్య, అఖిల్ గిరి, తన్మయ్ ఘోస్‌లు పార్టీ అధినేత్రి పక్కనే నిరనన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షోభంలో..? కాగా, అభిషేక్ బెనర్జీపై దాడి అనంతరం మమతాబెనర్జీ నివాసంలో గత ఆదివారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో 80 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 20 మందే హాజరయ్యారు. దీంతో ఆ సమావేశం రద్దయింది. ఎంపీలపై దాడి నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేరంటూ పార్టీ వివరణ ఇచ్చింది. అయితే పార్టీలో పెరుగుతున్న విభేదాలు, అంసతృప్తులే మెజారిటీ ఎమ్మెల్యేల గైర్హాజరుకు కారణమని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు కోల్‌కతాలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో సమావేశం కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. తమదే అసలు పార్టీ

కోల్‌కతా: 'పోరాటమో.. మరణమో' తేల్చుకుంటామంటూ టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మంగళవారంనాడు కోల్‌కతాలో భారీ ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి రోడ్లపైకి వచ్చారు. పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.


అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయినప్పటికీ 80 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలను మమతా బెనర్జీ ఇటీవల సస్పెండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 78కి చేరింది. వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు... నయన దాస్ బెనర్జీ, మదన్ మిత్రా, ఫిర్హాద్ హకీమ్, బిమన్ బెనర్జీ, అశోక్ దేబ్, సోవన్‌దేబ్ చటోపాధ్యాయ్ మాత్రమే మమతా బెనర్జీ నిరసన దీక్షలో పాల్గొన్నారు. టీఎంసీకి పార్లమెంటు ఉభయసభల్లో 41 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఐదుగురు ఎంపీలు..డెరిక్ ఒబ్రెయిన్, సమీరుల్ ఇస్లామ్, దోలా సేన్, మాలా రాయ్, కల్యాణ్ బెనర్జీ మాత్రమే నిరసన వేదిక వద్ద కనిపించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన చాంద్రిమ భట్టాచార్య, అఖిల్ గిరి, తన్మయ్ ఘోస్‌లు పార్టీ అధినేత్రి పక్కనే నిరనన కార్యక్రమంలో పాల్గొన్నారు.


సంక్షోభంలో..?

కాగా, అభిషేక్ బెనర్జీపై దాడి అనంతరం మమతాబెనర్జీ నివాసంలో గత ఆదివారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో 80 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 20 మందే హాజరయ్యారు. దీంతో ఆ సమావేశం రద్దయింది. ఎంపీలపై దాడి నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేరంటూ పార్టీ వివరణ ఇచ్చింది. అయితే పార్టీలో పెరుగుతున్న విభేదాలు, అంసతృప్తులే మెజారిటీ ఎమ్మెల్యేల గైర్హాజరుకు కారణమని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు కోల్‌కతాలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో సమావేశం కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. తమదే అసలు పార్టీ అంటూ 'అస్లీ తృణమూల్' పేరిట కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. టీఎంసీ అధికారిక సమావేశానికి గైర్హాజరైన 60 మంది ఎమ్మెల్యేలలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు 'అస్లీ తృణమూల్' వైపు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. తాజాగా మమతా బెనర్జీ నిరసన దీక్షలో కేవలం వేళ్లపై లెక్కపెట్టుకునే సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ పరిణామం సైతం పార్టీ సంక్షోభం దిశగా పయనిస్తోందనే సంకేతాలనిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

10 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయనున్న డీకే.. కొలిక్కి వచ్చిన మంత్రివర్గ కూర్పు

అమిత్‌షాను కలిసిన అన్నామలై.. ఊపందుకున్న కొత్త పార్టీ ప్రచారం

Andhra Jyothyలో పూర్తి కథనం చదవండి

తాజా వార్తలు

హర్మూజ్ జల సంధి వద్ద అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతి
TeluguOne•11 Jun
ఆసియా గేమ్స్ కు రంగం సిద్ధం.. ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియాకు డేంజర్ బెల్స్
TV9 Telugu•11 Jun
కోడి కూర వివాదం.. తండ్రి ప్రాణం తీసిన కొడుకు
TeluguOne•11 Jun
ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ ట్విస్ట్
SkyC Media•11 Jun
రైతులకు కాసుల వర్షం.. ఈ స్పెషల్ టెక్నిక్ తో బొప్పాయి సాగు చేస్తే లక్షల లాభాలు ఖాయం
Zee Telugu•11 Jun
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
TV9 Telugu•11 Jun

English Keywords

#mamata-banerjee#massive-dharna#few-mps-and-mlas#kolkata#west-bengal#telugu-news#india-news
మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు | nimisham.in